Home » Srisailam
శ్రీశైలం ( Srisailam ) ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో 22వ ధర్మకర్తల మండలి సమావేశం మంగళవారం నాడు జరిగింది. ఈ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది.
Andhrapradesh: శ్రీశైలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. శ్రీశైలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఓ భక్తుడు అనారోగ్యంతో చేరుకున్నాడు. అయితే అతను వచ్చి గంట అయినప్పటికీ వైద్యులు పట్టించుకోని పరిస్థితి. గంటపాటు వైద్యశాల వద్ద ఆటోలోనే ఉన్న మల్లన్న భక్తుడు.. వైద్యం కోసం ఎదురు చూసి చివరకు ప్రాణాలు వదిలాడు.
నంద్యాల: శ్రీశైలంలో మరోసారి చిరుతపులి కలకలం రేగింది. రాత్రుల సమయంలో అవుటర్ రింగ్ రోడ్డులో చిరుతపులి సంచరిస్తోంది. రత్నానందస్వామి ఆశ్రమం హోమగుండం దగ్గర గోడపై కూర్చుని ఉన్న చిరుతపులిని స్థానికులు, చుట్టుపక్కలవారు చూశారు.
నంద్యాల జిల్లా: ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులు కావడంతో దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతోంది.
శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సమావేశం ( Srisailam Board Meeting ) మంగళవారం నాడు జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా 30 ప్రతిపాదనలు 28 అంశాలను ఆమోదించారు.
శ్రీశైలం ఘాట్ రోడ్డు ( Srisailam Ghat Road ) లో మరోసారి భారీ ట్రాఫిక్ జామ్ అయింది. శ్రీశైలం నుంచి సుమారు ఆరు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయి రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి. శ్రీశైలం నుంచి ముఖద్వారం వరకు రోడ్లపై భక్తుల కార్లు బస్సులు నిలిచిపోయాయి.
నంద్యాల: శ్రీశైలం దేవస్థానంలో ఆరుగురు ఏఈవో స్థాయి అధికారులను అంతర్గత బదిలీ చేశారు. పరిపాలన సౌలభ్యం కోసం ఆరుగురు ఏఈవోలను బదిలీ చేస్తూ ఈవో పెద్దిరాజు ఉత్తర్వులు జారీ చేశారు.
Andhrapradesh: కార్తీకమాసం మూడవ సోమవారం కావడంతో శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.
కార్తీకమాసం రెండవ సోమవారం పౌర్ణమి కావడంతో శ్రీశైలం శ్రీభ్రరాంబికామల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మధ్యాహ్నం వరకు పౌర్ణమి ఉండటంతో పాతాళగంగలో భక్త జనం పుణ్యస్నానాలను ఆచరిస్తున్నారు.
శ్రీశైలంలో కన్నులపండువగా కార్తీక పౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయి. భక్తులు భారీగా తరలివచ్చారు. ఘనంగా నదీహారతి, జ్వాలాతోరణ మహోత్సవం జరుగుతోంది.