AP NEWS: ముగిసిన శ్రీశైలం ధర్మకర్తల మండలి సమావేశం.. ఏం చర్చించారంటే..?
ABN , Publish Date - Jan 09 , 2024 | 10:14 PM
శ్రీశైలం ( Srisailam ) ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో 22వ ధర్మకర్తల మండలి సమావేశం మంగళవారం నాడు జరిగింది. ఈ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది.
నంద్యాల : శ్రీశైలం ( Srisailam ) ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో 22వ ధర్మకర్తల మండలి సమావేశం మంగళవారం నాడు జరిగింది. ఈ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. ఈ సమావేశంలో 57 ప్రతిపాదనలను ఆమోదం తెలిపింది. ప్రాతకాలసేవలో పాల్గొనే భక్తులకు వెండి శివపార్వతుల ప్రతిమను ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. క్షేత్ర పరిధిలోకి పులులు రాకుండా శివరాత్రి లోపు ఫెన్సింగ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. భక్తుల సందర్శనకు ఏనుగుల చెరువు, మల్లమ్మ కన్నీరు ఇలా 20 ఎకరాల్లో నందనవనం ఏర్పాటుకు ఆమోదించింది. రాబోవు శివరాత్రి, రోజువారి అవసరాల కోసం సీసీ టీవీ నిర్వహణకు రూ. 34 లక్షలకు ఆమోదం తెలిపింది. అటవీశాఖ భూములను దేవాలయానికి ఇవ్వడానికి కొన్ని షరతులు పెట్టిందని.. వాటిని పునఃపరిశీలించాలని అటవీశాఖ అధికారులను చైర్మన్ చక్రపాణి రెడ్డి కోరారు.