Home » Sunday
‘ప్లాస్టిక్ బొమ్మలు వద్దు.. బట్ట బొమ్మలే ముద్దు..’ అంటున్న ఈ దంపతులు కొత్త ప్రయోగం చేశారు. బొమ్మల తయారీలో ఒక విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టారు. పర్యావరణ హిత బట్ట బొమ్మలను ఉత్పత్తి చేస్తూ.. తమిళనాడులోని నీలగిరి పర్వత ప్రాంత గిరిజనుల జీవితాల్లో కొత్త కాంతిని నింపారు... సుహాస్, సునీత దంపతులు..
శ్రీకృష్ణాష్టమికి ఉట్టి కొట్టే వేడుకలు ఊరూరా జరుగుతాయి. ఇలాంటి ఆటే ఇండోనేషియాలో కూడా కనిపిస్తోంది. అదే ‘పంజత్ పినాంగ్’. ఆ దేశ సంప్రదాయ క్రీడ ఇది. పోక చెట్ల పై భాగాన్ని కొట్టేసి, జెండా పెడతారు, దాని చుట్టూ చక్రంలాంటిది అమర్చుతారు.
భాషతో సంబంధం లేకుండా దక్షిణాదిన తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు దుల్కర్ సల్మాన్. ‘మహానటి’, ‘సీతారామం’ వంటి క్లాసిక్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ యువ హీరో ‘లక్కీ భాస్కర్’గా అలరించేందుకు సిద్ధమయ్యాడు.
భాగ్యనగరంలో ప్రతి ఏటా ఆషాఢ మాసంలో నెలరోజుల పాటు జరిగే బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వేదమంత్రాలు, ఊరేగింపులు, శివసత్తులు, పోతరాజుల నృత్యాలతో ఆదివారం చారిత్రక గోల్కొండ శ్రీ జగదాంబిక అమ్మవారి ఆలయంలో బోనాల వేడుకలకు శ్రీకారం చుట్టారు.
ఆదివారం వచ్చిందంటే చాలు.. స్కూలు పిల్లల దగ్గర్నుంచి పెద్ద పెద్ద ఉద్యోగస్తుల వరకు అందరూ రిలాక్స్ అయిపోతుంటారు. సెలవు రోజును చక్కగా ఎంజాయ్ చేస్తుంటారు. వారమంతా పని చేసి చివరి రోజున విరామం ఇస్తారు. ఇక అందరికీ ఇష్టమైన ఆదివారం సెలవు ఎందుకొచ్చిందో తెలుసా?
ఈ నెలలో వరసగా మూడు రోజులు విద్యా సంస్థలకు సెలవు వచ్చాయి. 8వ తేదీన శివరాత్రి సందర్భంగా పాఠశాలలు మూసి ఉంటాయి. 9వతేదీన రెండో శనివారం వచ్చింది. 10వ తేదీన ఆదివారం సెలవు ఉంటుంది. 11వ తేదీన సోమవారం తిరిగి స్కూళ్లను తెరుస్తారు.
తెలుగు సినిమా నిర్మాతగా 20 ఏళ్లు విజయవంతంగా కొనసాగటం అంత సులభం కాదు. అతి కొద్ది మందికి మాత్రమే సాధ్యమైన ఈ మైలురాయిని దిల్ రాజు తాజాగా దాటారు.