Share News

School Holidays: వరసగా మూడు రోజులు స్కూళ్లకు సెలవు.. ఏ రోజు నుంచి అంటే..?

ABN , Publish Date - Mar 05 , 2024 | 01:04 PM

ఈ నెలలో వరసగా మూడు రోజులు విద్యా సంస్థలకు సెలవు వచ్చాయి. 8వ తేదీన శివరాత్రి సందర్భంగా పాఠశాలలు మూసి ఉంటాయి. 9వతేదీన రెండో శనివారం వచ్చింది. 10వ తేదీన ఆదివారం సెలవు ఉంటుంది. 11వ తేదీన సోమవారం తిరిగి స్కూళ్లను తెరుస్తారు.

School Holidays: వరసగా మూడు రోజులు స్కూళ్లకు సెలవు.. ఏ రోజు నుంచి అంటే..?

హైదరాబాద్: సెలవు ( Holidays) వచ్చిందంటే చాలు పిల్లలు ఎగిరి గంతేస్తారు. వరసగా మూడు రోజులు వచ్చిందంటే ఇక అంతే సంగతులు. ఈ నెలలో కంటిన్యూగా మూడు రోజులు (Three Days) సెలవులు ( Holidays) వచ్చాయి. ఈ సెలవులే ( Holidays) కాదు పండగలు కూడా ఉన్నాయి. హోలి, గుడ్ ఫ్రైడే రోజుల్లో స్కూళ్లకు సెలవు ఉండనుంది. తెలంగాణతోపాటు (Telangana) ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) స్కూళ్లు సెలవు రోజుల్లో పనిచేయవు.

శివరాత్రి

మార్చి 8వ తేదీన మహా శివరాత్రి వచ్చింది. ఆ రోజున అన్ని స్కూళ్లకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సెలవు ప్రకటించాయి. 9వ తేదీన రెండో శనివారం వచ్చింది. ఆ రోజు స్కూళ్లు మూసి ఉంటాయి. ఆ మరునాడు 10వ తేదీన ఆదివారం సెలవు ఉంటుంది. 7వ తేదీన గురువారం సాయంత్రం స్కూల్స్ క్లోజ్ అవుతాయి. 11వ తేదీన సోమవారం రోజున స్కూళ్లు రీ ఓపెన్ అవుతాయి.

ఏప్రిల్‌లో కూడా

ఏప్రిల్ నెలలో కూడా స్కూళ్లకు సెలవులు వచ్చాయి. ఏప్రిల్ 5వ తేదీన బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వచ్చింది.. ఆ రోజు పాఠశాలలకు సెలవు ఉంటుంది. 9వ తేదీన ఉగాది పండగ సెలవు ఉంటుంది. 11వ తేదీన రంజన్ పండగ ఉంటుంది. 17వ తేదీన శ్రీరామ నవమి కోసం సెలవు ఉంటుంది. ఏప్రిల్ 25వ తేదీ లోపు అన్యువల్ పరీక్షలను నిర్వహిస్తారు. ఆ వెంటనే స్కూళ్లకు వేసవి సెలవులు ఇస్తారు. తిరిగి జూన్ 12త తేదీన స్కూల్స్ రీ ఓపెన్ అవుతాయి.

మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 05 , 2024 | 01:04 PM