Home » Sunday
కావలసిన పదార్థాలు: నెయ్యి - రెండు స్పూన్లు, బాస్మతి రైస్ (నీళ్లలో నానబెట్టిన) - ఒకటిన్నర కప్పు, పచ్చి బఠానీలు - 3 స్మూన్లు, బీన్స్, క్యారెట్, ఆలు ముక్కలు - అర కప్పు, ఉల్లి -పావు కప్పు,
కావలసిన పదార్థాలు: సగ్గుబియ్యం- 250 గ్రాములు, ఆలుగడ్డ (ఉడికించి, పొట్టుతీసిన) - 3, వేయించిన పల్లీల ముక్కలు - అర కప్పు, అల్లం ముక్కలు - అర స్పూను, పచ్చి మిర్చి- రెండు స్పూన్లు, కొత్తిమీర తరుగు- నాలుగు స్పూన్లు, జీలకర్ర పొడి- అర స్పూను, మిరియాల పొడి - అర స్పూను, ఆమ్చూర్- అర స్పూను, ఉప్పు, నీళ్లు, నూనె - తగినంత.
అనెగొందిలో నివాసం ఉండే సుదర్శనవర్మ విజయనగర రాజ కుటుంబీకులలో ఒకరు. ఆయన ప్రస్తుతం కొప్పల్, బళ్ళారి జిల్లాల్లో విజయనగర కాలం నాటి కాలువల పుసరుద్ధరణ డిమాండుతో రైతు ఉద్యమాన్ని నడుపుతున్నారు. విజయనగర సామ్రాజ్య కాలంలో గ్రావిటీతో ప్రవహించే పదహారు కాలువలు ఉండేవని గుర్తించిన ఆయన, వాటి పునరుద్ధరణకు నడుం బిగించారు.
కుక్కలు, పిల్లులకు కూడా రెజ్యూమ్స్ ఉంటాయా? ఎందుకనే అనుమానమూ వస్తుంది. ‘మా పెట్‌డాగ్ అందరితో కలిసిపోతుంది. మా పిల్లి కూల్‌గా ఉంటుంది. నవ్విస్తుంది’ అంటూ కొన్ని కాఫీషాప్లకు పెట్ యజమానులు రెజ్యూమ్స్ పంపిస్తున్నారు. కాఫీషాప్‌లో పని చేసి పెట్స్ వాటికి కావాల్సిన ‘స్నాక్ మనీ’ సంపాదించుకుంటున్నాయి. ఇప్పుడిది చైనాలో లేటెస్ట్ ట్రెండ్.
లారీ డ్రైవర్లు దేశమంతా తిరిగినా సరే.. తమ జీవిత కథల్ని మాత్రం ఎక్కడా చెప్పుకోరు. ఎవ్వరూ చెప్పరు. అందుకే రహదారులపై రయ్‌మని వెళుతున్న డ్రైవరన్నలు.. టక్కున స్టీరింగ్ తిప్పి యూట్యూబ్‌లోకి దూసుకొచ్చారు. రావడం రావడమే తమ సాదకబాధకాల్ని గట్టిగా హారన్ కొట్టి చెప్పడం మొదలెట్టారు. రోడ్ జర్నీని లోడ్ చేసుకొచ్చి.. యూట్యూబ్‌లో అన్లోడ్ చేస్తున్నారు.
పురాణాల్లోని కథల్లో, మన సంస్కృతీ సంప్రదాయాల్లోని పండుగల వెనుక ఎన్నెన్నో జీవన మార్గదర్శక సూత్రాలున్నాయి. వాటిలో దీపావళికి ముందురోజున జరుపుకునే నరకచతుర్దశి వెనుక విశేషమైన కథాపూర్వక హెచ్చరికలున్నాయి.
స్మార్ట్‌ఫోన్‌ను సరైన రీతిలో ఉపయోగిస్తే అరచేతిలో అన్నీ ఉన్నట్లే. వాతావరణ హెచ్చరికలు జారీ చేయడం దగ్గర నుంచి మహిళలకు భద్రత కల్పించడం వరకు... కొన్ని ‘యాప్స్’ సాయంతో స్మార్ట్‌ఫోన్ చాలానే చేస్తుంది. అవేంటో తెలుసుకుందాం...
కన్నడ రీమేక్ ‘సప్త సాగరాలు దాటి’లో క్యూట్ ప్రియ గుర్తుందా? తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది రుక్మిణీ వసంత్. తాజాగా ఈ కన్నడ కస్తూరి ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమాతో నేరుగా టాలీవుడ్లోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా ఆమె చెబుతున్న కొన్ని ముచ్చట్లివి...
అనంత శయన విష్ణు, ద్వారకా తిరుమల, వినాయక రథోత్సవం, ఆబాల గోపాలుడు... అన్నీ తాత్విక రేఖలే. చిత్రకళా రంగంలో ‘కాలిగ్రఫీ’ అనేది ప్రత్యేకమైన శైలి. పెన్నుతోగానీ, బ్రష్‌తో గానీ ఒక పద్ధతిలో అక్షరాలను చెక్కినట్టుగా, ఫ్రీహ్యాండ్గా బొమ్మలను గీయాల్సి ఉంటుంది.
రూబిక్స్ క్యూబ్ రంగులను ఒకవైపు చేర్చడం అందరికీ ఓ సరదా. అయితే అది అందరికీ సాధ్యపడదు. దానికి కూసింత తెలివి, ఓర్పు అవసరం. సాధారణంగా రూబిక్స్ క్యూబ్ అరచేతిలో పట్టేంత ఉంటుంది. అలాంటిది దాని పరిమాణంలో వెయ్యోవంతు అంటే... వేలి గోరుపై నిలిపేంత బుల్లి క్యూబ్‌ను సాల్వ్ చేయడమంటే మాటలా?