Home » Sunil Gavaskar
Sunil Gavaskar: సెంచూరియన్ టెస్టులో టీమిండియా బ్యాటింగ్ తీరుపై మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సీనియర్ ఆటగాడు ఆజింక్యా రహానె జట్టులో ఉంటే కథ వేరేలా ఉండేదని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోయినా రహానె మంచి ప్రదర్శన చేశాడని గుర్తుచేశాడు.
Sunil Gavaskar: మంగళవారం నుంచి భారత్, సౌతాఫ్రికా మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభంకానుంది. ఇప్పటివరకు సఫారీ గడ్డపై ఒకసారి కూడా టెస్ట్ సిరీస్ గెలవని టీమిండియా ఈ సారి ఆ లోటు తీర్చుకోవాలని భావిస్తోంది. దీంతో ఈ నెల 26 నుంచి ప్రారంభంకానున్న బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
Mumbai Indians: ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తొలగించడం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకు ఆ బాధ్యతలను అప్పగించడాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు.
Sunil Gavaskar: టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు సునీల్ గవాస్కర్ హాట్ కామెంట్లు చేశాడు. టీమిండియా అభిమానులకు వన్డే ప్రపంచకప్ పోయిన బాధ ఇప్పుడు లేదని.. ఇప్పుడు వాళ్ల దృష్టంతా ఐపీఎల్‌పైనే ఉందని ఎద్దేవా చేశాడు.
క్రికెట్ చరిత్రలో సునిల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ పేర్లు చిరస్థాయిగా నిలిచిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. వీరిలో సునిల్ గవాస్కర్ లిటిల్ మాస్టర్‌గా పేరుగాంచి ఎన్నో రికార్డులు సాధిస్తే.. మరోవైపు...
భారత్, పాకిస్థాన్ జట్లకు ప్రపంచకప్ గెలిచే సత్తా లేదని సునీల్ గవాస్కర్ తేల్చేశాడు. తన అభిప్రాయం ప్రకారం డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ మరోసారి ప్రపంచకప్ గెలుస్తుందని జోస్యం చెప్పాడు.
ఆసియా కప్ 2023 కోసం ఎంపిక చేసిన టీమిండియా స్క్వాడ్‌పై విమర్శలు చేస్తున్న వారిపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాదాలు సృష్టించడం ఆపండంటూ మండిపడ్డారు.
ప్రస్తుత టీమిండియా ఆటగాళ్లకు డబ్బు, అహంకారం, అహం పెరిగిపోయాయంటూ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ విమర్శల వర్షం కురిపించారు. ప్రస్తుత ఆటగాళ్లు తమకు అంతా తెలుసని భావిస్తారని, సీనియర్ల నుంచి సలహాలు తీసుకోవడానికి ఇష్టపడరని మండిపడ్డారు.
భారత క్రికెట్ జట్టు 1983 ప్రపంచకప్ గెలిచి నేటికి సరిగ్గా 40 సంవత్సరాలు పూర్తయ్యాయి. దీంతో భారత క్రికెట్ అభిమానులంతా ఆ మధురానుభుతులను ఒకసారి నెమరువేసుకుంటున్నారు. నాటి విజయం ఏ ఒక్కరి వల్లనో దక్కింది కాదు. నాటి ప్రపంచకప్ విజయంలో టీంలోని ఆటగాళ్లంతా కీలకపాత్ర పోషించారు. అయితే నాటి ప్రపంచకప్ ఆడిన భారత జట్టులో మొత్తం ఎంత మంది ఆటగాళ్లు ఉన్నారు? ఎవరెవరు ఉన్నారు? ఎవరు ఎలా ఆడారు.? ఏ బ్యాటర్ ఎన్ని రన్స్ కొట్టాడు? ఏ బౌలర్ ఎన్ని వికెట్లు తీశాడు? అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టీమిండియా మాజీ ఆటగాళ్లు సునీల్ గవాస్కర్, ఆకాష్ చోప్రా విండీస్ పర్యటనకు సర్ఫరాజ్ ఖాన్‌ను ఎంపిక చేయకపోవడం పట్ల పెదవి విరిచారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో రాణించిన వారిని కాకుండా.. ఐపీఎల్లో రాణించినవారిని టెస్ట్ టీంకు ఎంపిక చేయడం పట్ల ఈ మాజీలిద్దరు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్ బాల్ క్రికెట్‌కు వైట్ బాల్ క్రికెట్ ఆడిన వారిని ఎంపిక చేస్తే ఇక ప్రతి ఏడాది రంజీలు నిర్వహించడమేందుకని ప్రశ్నించారు.