Home » sunitha
తన తండ్రి వైయస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన విషయం.. తాము హైదరాబాద్ నుంచి కడపకు బయలుదేరిన కొద్ది సేపటికి.. అంటే శంషాబాద్ టోల్ గేట్ వద్ద ఉన్నప్పుడు తెలిసిందని ఆయన కుమార్తె సునీత నర్రెడ్డి స్పష్టం చేశారు.
కడప: సీఎం జగన్ సొంత అడ్డా పులివెందుల అసెంబ్లీ నియోజక వర్గంలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. వివేక కుమార్తె సునీత అక్క కడప పార్లమెంట్ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి షర్మిలకు అనుకూలంగా ప్రచారం చేస్తున్న ఆమెకు జనం నీరాజనం పలుకుతున్నారు.
రాష్ట్రంలో వైయస్ జగన్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అలాగే ఆయన సోదరుడు, కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డికి సైతం ఆయన సొంత నియోజకవర్గ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందనే ఓ చర్చ ఉమ్మడి కడప జిల్లా రాజకీయాల్లో హల్చల్ చేస్తోంది.
కడప: వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసింది ఎవరు? వారిని కాపాడుతోంది ఎవరు? జగన్ ఎందుకు ఇంత డ్రామా ఆడుతున్నారన్న దానిపై వివేకా కుమార్తె సునీత సోమవారం మీడియా సమావేశంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. షర్మిలకు ఎంపీ టిక్కెట్ ఇవ్వాలని వివేకానంద రెడ్డి పట్టుపడుతున్నారని...
కొంగు చాచి అడుగుతున్న.. మీ ఆడ బిడ్డలం, న్యాయం చేయండి.. మీరే న్యాయ నిర్ణేతలు ఒకవైపు వైఎస్ఆర్ బిడ్డ, మరోవైపు హంతకుడు బరిలో ఉన్నాడని వైఎస్ షర్మిల పులివెందుల బహిరంగ సభలో భావొద్వేగంతో మాట్లాడారు. షర్మిల పక్కన సునీత కూడా ఉన్నారు. ఆడ బిడ్డలం కొంగు చాచి అడుగుతున్నం అని కంట నీరు తెచ్చుకున్నారు. ఒక వైపు న్యాయం ఉంది. మరో వైపు ధర్మం ఉంది.. వైఎస్ఆర్ బిడ్డ కావాలో.. వివేకా హత్య కేసు నిందితుడు కావాలో తేల్చుకోవాలని సూచించారు.
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎంతో విలువైనవి. ఐదేళ్ల పాటు ప్రజలు తమ పాలకులను ఎన్నుకునే సమయం. అధికారం ఇస్తే ప్రజలకు ఏం చేస్తాం.. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశామనేవి రాజకీయ పార్టీలు చెప్పుకుంటుంటాయి. కాని ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ(YCP)కి మాత్రం ఎన్నికలంటే గుర్తొచ్చేది చావులతో సానుభూతి రాజకీయం అనే ప్రచారం జోరుగా సాగుతోంది.
‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్రను ప్రారంభించిన వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ప్రొద్దుటూరు బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ఓటర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నిన్న ఈడీ కస్టడీలో ఉన్న తన భర్త కేజ్రీవాల్‌ను కలిశానని చెప్పారు. లిక్కర్ కేసు డబ్బు ఎక్కడ ఉందో రేపు కేజ్రీవాల్ కోర్టులో దేశ ప్రజలకు చెబుతారన్నారు. దాని ఆధారాలు బయటపెడతారని ఆమె తెలిపారు.
గ్రేటర్ పరిధిలోని ఎంపీ అభ్యర్థులను కాంగ్రెస్(Congress) పార్టీ ప్రకటించింది. సికింద్రాబాద్ టికెట్‌ను దానం నాగేందర్(Donation to Nagender)కు, మల్కాజిగిరి సునీతామహేందర్ రెడ్డికి, చేవెళ్ల రంజిత్‌రెడ్డికి కేటాయించింది.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్‌లో కుట్ర కోణం ఉందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్(Satyavathi Rathod) అన్నారు. మంగళవారం నాడు తెలంగాణ భవన్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఈడీ, సీబీఐ విశ్వాసం కోల్పోతున్నాయని చెప్పారు.