Share News

Most Wanted Terrorist: కేజ్రీవాల్‌ వ్యవహారంలో ఈడీ తీరుపై మండిపడ్డ సునీత

ABN , Publish Date - Jun 21 , 2024 | 08:32 PM

ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వ్యవహరిస్తున్న తీరుపై ఆయన భార్య సునీత కేజ్రీవాల్ మండిపడ్డారు. అరవింద్ కేజ్రీవాల్.. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అన్నట్లుగా ఈడీ వ్యవహరశైలి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Most Wanted Terrorist: కేజ్రీవాల్‌ వ్యవహారంలో ఈడీ తీరుపై మండిపడ్డ సునీత

న్యూఢిల్లీ, జూన్ 21: ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వ్యవహరిస్తున్న తీరుపై ఆయన భార్య సునీత కేజ్రీవాల్ మండిపడ్డారు. అరవింద్ కేజ్రీవాల్.. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అన్నట్లుగా ఈడీ వ్యవహరశైలి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని నియంత అన్ని హద్దులను అత్రికమించారంటూ ప్రధాని మోదీపై సునీత కేజ్రీవాల్ పరోక్ష విమర్శలు చేశారు. దక్షిణ ఢిల్లీలోని బోగల్‌లో విలేకర్లతో సునీతమాట్లాడారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు నిన్న ట్రయిల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ రోజు ఉదయం ఆదేశాలు అందాయి. దీంతో కేజ్రీవాల్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఇన్ ఇండియాగా అయిపోయారని ఆమె పేర్కొన్నారు.

Also Read: BJP: జేపీ నడ్డాకు ‘కీలక బాధ్యతలు’ అప్పగించిన పార్టీ అగ్రనాయకత్వం..!


Also Read: Delhi High Court: బెయిల్ వచ్చినా.. మంగళవారం వరకు జైల్లోనే..

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసింది. ఆ క్రమంలో ఆయనకు గురువారం ట్రయిల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేజ్రీవాల్‌‌కు బెయిల్ మంజురును రద్దు చేయాలంటూ ఈడీ.. ఢిల్లీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై వాదనలు విన్న ఢిల్లీ సుప్రీంకోర్టు.. తన నిర్ణయాన్ని మంగళవారం తెలియజేస్తానని తెలిపింది. ఈ నేపథ్యంలో ఈడీ వ్యవహారశైలిపై సునీత కేజ్రీవాల్ నిప్పులు చెరిగారు.

Also Read: PM Sheikh Hasina: రెండు రోజుల పర్యటన కోసం భారత్ వచ్చిన బంగ్లా ప్రధాని

మరోవైపు హర్యానా నుంచి ఢిల్లీకి మరిన్ని మంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆప్ మంత్రి అతిశీ దక్షిణ ఢిల్లీలోని బోగల్‌లో అమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆ క్రమంలో ఆ దీక్షా శిబిరాన్ని శుక్రవారం సునీత కేజ్రీవాల్ సందర్శించారు.

Read Latest Telangana News and Telugu News

Updated Date - Jun 21 , 2024 | 08:32 PM