Home » Sunrisers Hyderabad
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. ఈ సీజన్లో రెండు జట్లు కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగుతున్నాయి.
ఐపీఎల్ 2024లో శుక్రవారం నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ పోరాటం మొదలుకానుంది. గతేడాది ఫేలవ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన సన్‌రైజర్స్ ఈ సారి సత్తా చాటాలని భావిస్తోంది. కొత్త కెప్టెన్ పాట్ కమిన్స్ ఆధ్వర్యంలో ఫుల్ జోష్‌లో కనిపిస్తోంది.
‘సన్‌రైజర్స్ హైదరాబాద్’ ఫ్రాంచైజీ సహ-యజమాని కావ్య మారన్ మైదానంలో ఎప్పుడూ చూసిన దుఃఖంతోనే కనిపిస్తారు. ఐపీఎల్లో తన జట్టు ఆశించిన స్థాయిలో ప్రదర్శన కనబర్చనప్పుడు.. ఆమె ఆవేదన చెందుతుంటారు. నోటితో చెప్పకపోయినా.. తన భావాలతోనే ‘సరిగ్గా ఆడండిరా బాబు’ అంటూ నిట్టూరుస్తుంటారు.
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ జట్టు వరుసగా రెండో సీజన్లోనూ అదరగొట్టింది. ఎయిడెన్ మాక్రమ్ కెప్టెన్సీలోని సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ వరుసగా రెండో సారి ఛాంపియన్‌గా నిలిచింది. వన్‌సైడేడ్‌గా జరిగిన ఫైనల్ పోరులో డర్బన్ సూపర్ జెయింట్స్‌పై సన్‌రైజర్స్ ఘనవిజయం సాధించింది.
రంజీ ట్రోఫీ 2024లో టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ చెలరేగుతున్నాడు. లీగ్ దశ పోటీల్లో భాగంగా బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో అయితే విశ్వరూపం చూపించాడు. నిప్పులు చెరిగే బౌలింగ్‌తో ఏకంగా 8 వికెట్లు పడగొట్టాడు.
Pat Cummins: ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. ఈ సంవత్సరం కమిన్స్ ఏది పట్టుకున్నా బంగారమే అయింది. ఈ ఏడాది జూన్‌లో కమిన్స్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ గెలిచింది.
David Warner: ఐపీఎల్ వేలం జరుగుతున్న సమయంలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ సోషల్ మీడియాలో బ్లాక్ చేసింది. ఈ విషయాన్ని వార్నర్ స్వయంగా అభిమానులతో పంచుకున్నాడు. ఈ మేరకు స్క్రీన్ షాట్లను షేర్ చేశాడు.
IPL Auction: ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు వేలంలో అమ్ముడుపోయాడు. అతడిని సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.20.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో ఇంత ధర ఏ ఆటగాడు పలకలేదు.
భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌పై సెంచరీతో చెలరేగిన ఆసీస్ ఆటగాడు ట్రావిస్ హెడ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. ఏకంగా రూ.6.80 కోట్ల మొత్తాన్ని వెచ్చించి అతడిని సొంతం చేసుకుంది.
IPL 2024 action: ఐపీఎల్ వేలానికి అంతా సిద్ధమైంది. తొలిసారిగా ఓ మహిళ వేలాన్ని నిర్వహించనుండడం గమనార్హం. ఇటీవల ముగిసిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలాన్ని నిర్వహించిన మల్లికా సాగర్ ఈ వేలాన్ని కూడా నిర్వహించనున్నారు.