SA20: వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా సన్‌రైజర్స్.. ఫైనల్లో సూపర్ కింగ్స్ చిత్తు
ABN , Publish Date - Feb 11 , 2024 | 11:54 AM
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ జట్టు వరుసగా రెండో సీజన్‌లోనూ అదరగొట్టింది. ఎయిడెన్ మాక్రమ్ కెప్టెన్సీలోని సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ వరుసగా రెండో సారి ఛాంపియన్‌గా నిలిచింది. వన్‌సైడేడ్‌గా జరిగిన ఫైనల్ పోరులో డర్బన్ సూపర్ జెయింట్స్‌పై సన్‌రైజర్స్ ఘనవిజయం సాధించింది.
కేప్‌టౌన్: సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ జట్టు వరుసగా రెండో సీజన్‌లోనూ అదరగొట్టింది. ఎయిడెన్ మాక్రమ్ కెప్టెన్సీలోని సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ వరుసగా రెండో సారి ఛాంపియన్‌గా నిలిచింది. వన్‌సైడేడ్‌గా జరిగిన ఫైనల్ పోరులో డర్బన్ సూపర్ జెయింట్స్‌పై సన్‌రైజర్స్ ఘనవిజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో దుమ్ములేపిన సన్ రైజర్స్ 89 పరుగుల భారీ తేడాతో గెలిచి ట్రోఫిని ముద్దాడింది. సౌతాఫ్రికా టీ20 లీగ్ గతేడాదే ప్రారంభంకాగా ఇప్పటివరకు జరిగిన రెండు సీజన్లలో సన్‌రైజర్స్ జట్టే విజేతగా నిలవడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోర్ సాధించింది. రెండో ఓవర్లోనే ఓపెనర్ డేవిడ్ మలాన్(6) వికెట్ కోల్పోయినప్పటికీ.. రెండో వికెట్‌కు జోర్డాన్ హెర్మాన్(42), టామ్ అబెల్(55) కలిసి 52 బంతుల్లోనే 90 పరుగులు జోగించారు. అయితే వీరిద్దరిని 11వ ఓవర్లో కేశవ్ మహారాజ్ పెవిలియన్ చేర్చాడు. దీంతో 106 పరుగులకు సన్‌రైజర్స్ 3 వికెట్లు కోల్పోయింది.
అనంతరం కెప్టెన్ ఎయిడెన్ మాక్రమ్, ట్రిస్టన్ స్టబ్స్ కలిసి నాలుగో వికెట్‌కు అజేయంగా 55 బంతుల్లోనే 98 పరుగులు జోడించారు. దీంతో జట్టు స్కోర్ 200 దాటింది. 4 ఫోర్లు, 3 సిక్సులతో 30 బంతుల్లోనే 56 పరుగులు చేసిన స్టబ్స్, 3 ఫోర్లు, 2 సిక్సులతో 26 బంతుల్లోనే 42 పరుగులు చేసిన మాక్రమ్ నాటౌట్‌గా నిలిచారు. సూపర్ కింగ్స్ బౌలర్లలో కేశవ్ మహారాజ్ 2, టోప్లీ ఒక వికెట్ తీశారు. అనంతరం 205 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన డర్బన్ సూపర్ జెయింట్స్ ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. సన్‌రైజర్స్ బౌలర్ల ధాటికి ఆరంభం నుంచే వరుసగా వికెట్లు కోల్పోయింది. దీంతో 17 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసిన 115 పరుగులకే కుప్పకూలింది. 38 పరుగులు చేసిన వియాన్ ముల్డర్ ఆ జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 5 వికెట్లతో చెలరేగిన మార్కో జాన్సన్ సూపర్ కింగ్స్ నడ్డి విరిచాడు. డేనియల్ వోరల్, ఒట్నీల్ బార్ట్‌మాన్ రెండేసి వికెట్లు, సైమన్ హార్మర్ ఒక వికెట్ తీశారు. హాఫ్ సెంచరీతో చెలరేగిన టామ్ అబెల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సీజన్ మొత్తంలో 447 పరుగులు చేసిన హెన్రిచ్ క్లాసెన్‌కు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ దక్కింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.