Share News

IPL 2024: సన్‌రైజర్స్ vs నైట్ రైడర్స్ మ్యాచ్ పిచ్ రిపోర్టు ఎలా ఉందంటే..

ABN , Publish Date - Mar 23 , 2024 | 03:35 PM

ఐపీఎల్ 2024లో శుక్రవారం నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ పోరాటం మొదలుకానుంది. గతేడాది ఫేలవ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన సన్‌రైజర్స్ ఈ సారి సత్తా చాటాలని భావిస్తోంది. కొత్త కెప్టెన్ పాట్ కమిన్స్ ఆధ్వర్యంలో ఫుల్ జోష్‌లో కనిపిస్తోంది.

IPL 2024: సన్‌రైజర్స్ vs నైట్ రైడర్స్ మ్యాచ్ పిచ్ రిపోర్టు ఎలా ఉందంటే..

కోల్‌కతా: ఐపీఎల్ 2024లో శుక్రవారం నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ పోరాటం మొదలుకానుంది. గతేడాది ఫేలవ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన సన్‌రైజర్స్ ఈ సారి సత్తా చాటాలని భావిస్తోంది. కొత్త కెప్టెన్ పాట్ కమిన్స్ ఆధ్వర్యంలో ఫుల్ జోష్‌లో కనిపిస్తోంది. గతేడాది ఆస్ట్రేలియాకు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌తోపాటు వన్డే ప్రపంచకప్ గెలిపించి పెట్టిన కమిన్స్‌పై సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్‌తోపాటు అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ శనివారం తమ మొదటి మ్యాచ్ ఆడనుంది. మొదటి మ్యాచ్‌లో కోల్‌కతానైడ్ రైడర్స్ జట్టుతో తలపడనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అటు అతిథ్య కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా ఫుల్ జోష్‌లో కనిపిస్తోంది. తమ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఈ సీజన్‌లో ఆడడానికి తోడు కోల్‌కతాకు రెండు ఐపీఎల్ టైటిళ్లు అందించిన గౌతం గంభీర్ ఈసారి ఆ జట్టుకు మెంటార్ కావడం సానుకూలాంశం. టేబుల్‌పై రెండు జట్లు అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తున్నాయి. దీంతో రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానున్న ఈ మ్యాచ్‌లో గెలిచి సీజన్‌లో శుభారంభం చేయాలని రెండు జట్లు భావిస్తున్నాయి. ఐపీఎల్ చరిత్రలో రెండు జట్లు ఇప్పటివరకు 25 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. అత్యధికంగా కోల్‌కతా 16 మ్యాచ్‌ల్లో గెలవగా, హైదరాబాద్ 9 మ్యాచ్‌ల్లో గెలిచింది.


మ్యాచ్ జరిగే ఈడెన్ గార్డెన్స్ పిచ్ రిపోర్టు విషయానికొస్తే.. ఐపీఎల్‌లో ఇది బ్యాటర్లకు స్వర్గధామం. ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించనుంది. దీంతో ఇక్కడ బౌలర్లకు కాస్త ఇబ్బందులు తప్పకపోవచ్చు. గత సీజన్‌లో ఇక్కడ జరిగిన 7 మ్యాచ్‌ల్లో ఏకంగా 4 ఇన్నింగ్స్‌ల్లో 200+ స్కోర్లు నమోదయ్యాయి. గతేడాది ఇక్కడ అత్యల్ప స్కోర్ 149గా ఉంది. రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో కేకేఆర్ చేసింది. బ్యాటింగ్ పిచ్ కావడంతో టాస్ ప్రభావం అంతగా ఉండదు. గత సీజన్‌లో జరిగిన 7 మ్యాచ్‌ల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 4 సార్లు.. సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు 3 సార్లు గెలిచాయి. అంతర్జాతీయ క్రికెట్‌ పరంగా చూసుకున్న ఈడెన్ గార్డెన్స్‌లో ఇప్పటివరకు 11 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 5 సార్లు.. సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు 6 సార్లు గెలిచాయి. మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోర్ 155గా ఉండగా.. సెకండ్ ఇన్నింగ్స్ సగటు స్కోర్ 137గా ఉంది. అత్యధిక స్కోర్ 201/5గా ఉంది. బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్ సాధించింది. అత్యల్ప స్కోర్ 70గా ఉంది. న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్ చేసింది. అత్యధిక చేధనగా 162/4గా ఉంది. వెస్టిండీస్‌పై టీమిండియా చేధించింది. ఓ జట్టు కాపాడుకున్న అత్యల్ప స్కోర్ 186/5గా ఉంది. వెస్టిండీస్‌పై టీమిండియా డిఫెండ్ చేసుకుని గెలిచింది.

జట్లు

కోల్‌కతా నైట్ రైడర్స్: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, రింకు సింగ్, రహ్మానుల్లా గుర్బాజ్, ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్, సుయాష్ శర్మ, అంకూల్ రాయ్, ఆండ్రీ రస్సెల్, వెంకటేష్ అయ్యర్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, సా.కారియ భరతవర్తి, కేఎస్ చక్రవర్తి , మిచెల్ స్టార్క్, అంగ్క్రిష్ రఘువంశీ, రమణదీప్ సింగ్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, మనీష్ పాండే, ముజీబ్ ఉర్ రెహమాన్, దుష్మంత చమీరా, సాకిబ్ హుస్సేన్.

సన్‌రైజర్స్ హైదరాబాద్: అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రామ్, మార్కో జాన్సెన్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ అగర్వాల్, టి. నటరాజన్, అన్మోల్‌ప్రీత్ సింగ్, మయాంక్ మార్కండే సింగ్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, నితీష్ కుమార్ రెడ్డి, ఫజల్హక్ ఫరూకీ, షాబాజ్ అహ్మద్, ట్రావిస్ హెడ్, వనిందు హసరంగా, పాట్ కమిన్స్(కెప్టెన్), జయదేవ్ ఉనద్కత్, ఆకాష్ సింగ్, ఝాతావేద్ సుబ్రమణ్యన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 23 , 2024 | 06:33 PM