Home » Supriya
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ పశ్చాత్తాపపడుతున్నారా? ఎన్నికల్లో తప్పు చేశానని ఫీల్ అవుతున్నారా? అంటే అవుననే అంటున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. లోక్‌సభ ఎన్నికల్లో తాను పెద్ద తప్పు చేశానని అన్నారు.
కేంద్ర మాజీ మంత్రి, ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ కూతురు, ఎంపీ సుప్రియా సూలే ఫోన్ హ్యాక్ అయ్యింది. ఆమె వాట్సాప్‌ను కూడా కేటుగాళ్లు హ్యాక్ చేశారు. ఇదే విషయాన్ని సుప్రియా సూలే ఎక్స్‌వేదికగా ప్రకటించారు. తన ఫోన్, వాట్సాప్ హ్యాక్ అయ్యాయని..
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ గురువారం రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బారామతి లోక్‌సభ స్థానం నుంచి సునేత్ర పవార్ బరిలో దిగారు.
మహారాష్ట్రలోని 48 లోక్ సభ స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. కీలకమైన బారామతి లోక్‌సభ స్థానం నుంచి ఎన్సీపీ అభ్యర్థి సునేత్ర పవార్‌పై ఎన్సీపీ (ఎస్పీ) అభ్యర్థి సుప్రియా సులే అధిక్యంలో కొనసాగుతున్నారు.
ఈ లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడీ 30 నుంచి 35 స్థానాలను కైవసం చేసుకుంటుందని శివసేన (యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ప్రతిష్ట కోసం భారమతి నుంచి పోరాటం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం పుణేలో సంజయ్ రౌత్ విలేకర్లతో మాట్లాడారు.
మహారాష్ట్రలో లోక్ సభ ఎన్నికలు రాజకీయ వేడి రాజేస్తున్నాయి. బీజేపీ మిత్రపక్షమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) బారామతి నియోజకవర్గం నుంచి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్‌ను పోటీకి దింపింది.
బారామతి లోక్ సభ నియోజకవర్గం శరద్ పవార్ కంచుకోట. 1967 నుంచి అసెంబ్లీ, లోక్ సభలో శరద్ పవార్ గెలుస్తున్నారు. బారామతి లోక్ సభ నుంచి 2009లో శరద్ పవార్ కూతురు సుప్రియ సూలే బరిలోకి దిగారు. అప్పటి నుంచి బారామతి నియోజకవర్గంలో వరసగా విజయం సాధిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మాత్రం సుప్రియకు గట్టి పోటీ ఉండనుంది. బారామతి నుంచి ఎన్సీపీ తరఫున అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ బరిలో దిగారు.
బీజేపీ ఇతర పార్టీల నేతలను ప్రలోభాలకు గురి చేసి వారి పార్టీలోకి లాగుతుందని మాజీ సీఎం శరద్ పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సులే ఆరోపించారు. ఆ పార్టీ ప్రలోభాలకు లొంగని వారిపై అక్రమ కేసులు పెట్టి జైల్లో వేస్తూ.. నీచ రాజకీయాలు చేస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రానున్న లోక్‌సభ ఎన్నికలు మహారాష్ట్రలో కీలకం కానున్నాయి. బారామతిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. ఈ ఎన్నికల్లో పవార్ కుటుంబం మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఏ రాజకీయ పార్టీలోనూ విలీనం కాబోదని ఆ పార్టీ లోక్‌సభ సభ్యురాలు సుప్రియా సూలే తేల్చిచెప్పారు. తమ వర్గం ఏ రాజకీయ పార్టీలోనూ విలీనం కాదని..