Share News

Supriya Sule: ఎవరూ కాల్స్, మెసేజెస్ చేయొద్దన్న ఎంపీ.. ఎందుకంటే..!

ABN , Publish Date - Aug 11 , 2024 | 06:37 PM

కేంద్ర మాజీ మంత్రి, ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ కూతురు, ఎంపీ సుప్రియా సూలే ఫోన్ హ్యాక్ అయ్యింది. ఆమె వాట్సాప్‌ను కూడా కేటుగాళ్లు హ్యాక్ చేశారు. ఇదే విషయాన్ని సుప్రియా సూలే ఎక్స్‌వేదికగా ప్రకటించారు. తన ఫోన్, వాట్సాప్ హ్యాక్ అయ్యాయని..

Supriya Sule: ఎవరూ కాల్స్, మెసేజెస్ చేయొద్దన్న ఎంపీ.. ఎందుకంటే..!
NCP MP Supriya Sule

ముంబై, ఆగష్టు 11: కేంద్ర మాజీ మంత్రి, ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ కూతురు, ఎంపీ సుప్రియా సూలే ఫోన్ హ్యాక్ అయ్యింది. ఆమె వాట్సాప్‌ను కూడా కేటుగాళ్లు హ్యాక్ చేశారు. ఇదే విషయాన్ని సుప్రియా సూలే ఎక్స్‌వేదికగా ప్రకటించారు. తన ఫోన్, వాట్సాప్ హ్యాక్ అయ్యాయని.. తనకు ఎవరూ కాల్ చేయొద్దని ఎక్స్ వేదికగా తెలిపారు. తనకు కాల్స్ గానీ.. మెసేజ్‌లు గానీ పంపవద్దని కోరారు. ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేశానని సుప్రియా సూలే పేర్కొన్నారు.


ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన సుప్రియ.. ‘నా ఫోన్, వాట్సాప్ హ్యాక్ అయ్యాయి. దయచేసి నాకు కాల్, మెసేజ్ చేయొద్దు. ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. దీనిని అందరూ గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.’ అని పేర్కొన్నారు.


కాగా, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సుప్రియా సూలే బారామతి నియోజకవర్గం నుంచి 1.55 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. మహారాష్ట్రంలో అత్యంత హైప్రొఫైల్ పోటీగా మారిన బారామతి నియోజకవర్గంలో మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్‌పై సుప్రియా భారీ ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో సుప్రియా సూలేకు 7,32,312 ఓట్లు రాగా, సునేత్ర పవార్‌కు 5,73,979 ఓట్లు వచ్చాయి. గత సంవత్సరం తన తండ్రి శరద్ పవార్‌పై తిరుగుబాటు చేసి పార్టీని చీల్చిన అజిత్ పవార్ కుటుంబానికి బారామతి కంచుకోట. దీంతో ఆమె గెలవడం చాలా కష్టమని అంతా భావించారు. కానీ, ఎన్నికల్లో సీన్ రివర్స్ అయ్యింది. సుప్రియా భారీ మెజార్టీతో గెలుపొందింది.


త్వరలో ‘మహా’ సంగ్రామం..

ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై ఆ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ దృష్టి సారించాయి. ఎన్‌సీపీ ఆధ్వర్యంలో శివస్వరాజ్య యాత్రను శుక్రవారం పూణెలోని జున్నార్‌లో గల చారిత్రాత్మక శివనేరి కోట నుంచి ప్రారంభించారు. ఆగష్టు 9వ తేదీన క్రాంతి మైదాన్‌లో మహాత్మా గాంధీ బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా ‘క్విట్ ఇండియా’ ఉద్యమానికి నాంది పలికారని.. అందుకు సింబాలిక్‌గానే ఈ రోజునే శివస్వరాజ్య యాత్రను చేపట్టినట్లు ఎన్‌సీపీ మహారాష్ట్ర చీఫ్ జయంత్ పాటిల్ చెప్పారు.

For More National News and Telugu News..

Updated Date - Aug 11 , 2024 | 06:37 PM