Home » Suryapet
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి దమ్ముంటే సూర్యాపేటలో పోటీ చేయాలి. ఎవరికి డిపాజిట్ రాదో తెలుస్తుంది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సవాల్ చేస్తున్నా. ఎంతమంది వచ్చినా సరే.. బస్సులు మావే.. ఖర్చులు మావే.... ఏం టైమ్‌కు పోయినా ఓకే
సూర్యాపేట జిల్లాలో మేళ్లచెరువులో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మైనర్లను మేజర్లని గుడ్డిగా నమ్మి రక్షణ కల్పించారు. ఈ నెల 1న పెళ్లి చేసుకుని తప్పుడు ఆధార్ కార్డులతో మేజర్లుగా చూపించి రక్షణ కోసం మేళ్లచెరువు పోలీస్ స్టేషన్‌ను ఓ జంట ఆశ్రయించింది.
జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మైనర్లను మేజర్లంటూ గుడ్డిగా నమ్మి వారికి ఖాకీలు రక్షణ కల్పించారు.
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తు అన్ని రంగాల ప్రజలు నిరసన తెలుపుతున్నారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లోని ఐటీ నిపుణులు, ఉద్యోగులు సీఎం జగన్ కి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. ఇదే క్రమంలో హైదరాబాద్ సాఫ్ట్ వేర్ రంగ నిపుణులు హైదరాబాద్ నుంచి రాజమండ్రికి సంఘీభావ యాత్రలో పాల్గొనడానికి తరలి వస్తున్నారు. వారి కోసం ఓ హోటల్ ఓనర్ ఫుడ్ పై ఏకంగా 50 శాతం రాయితీ ప్రకటించారు.
జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ బోల్తా పడడంతో ఇద్దరు మృతి చెందారు. సూర్యాపేట(Suryapet) జిల్లాలోని గరిడేపల్లి మండలం కల్మలచెరువు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
జిల్లాలోని హాలియాలో యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. వర్షాలు పడడంతో యూరియాకు డిమాండ్ పెరిగింది. బయట మార్కెట్లో, డీలర్ల వద్ద యూరియా లేకపోవడంతో వ్యవసాయ సహకార సంఘాలకు రైతాంగం క్యూ కట్టింది.
విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి(Minister Jagdish Reddy) చీకటి దందాను వెలికి తీస్తామని బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar)హెచ్చరించారు. సోమవారం నాడు సూర్యాపేటలో పర్యటించారు.
బీఆర్ఎస్(BRS) ముందే అభ్యర్థులను ప్రకటించడంతో ప్రతిపక్ష నాయకులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని మంత్రి జగదీష్‌రెడ్డి(Minister Jagdish Reddy) అన్నారు.
రాష్ట్రంలో మళ్లీ తామే అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అద్భుతంగా మరోసారి గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం లేదన్నారు.
సూర్యాపేట: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సూర్యాపేట పర్యటన నేపథ్యంలో పోలీసులు పలువురు కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. బీజేపీ ఇతర పార్టీల నేతలను ముందస్తు అరెస్టులు చేశారు.