TS News: మైనర్లను మేజర్లంటూ గుడ్డిగా నమ్మిన పోలీసులు ఏం చేశారో చూడండి...
ABN , First Publish Date - 2023-09-29T10:44:02+05:30 IST
జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మైనర్లను మేజర్లంటూ గుడ్డిగా నమ్మి వారికి ఖాకీలు రక్షణ కల్పించారు.
సూర్యాపేట: జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మైనర్లను మేజర్లంటూ గుడ్డిగా నమ్మి వారికి ఖాకీలు రక్షణ కల్పించారు. జిల్లాకు చెందిన ఓ అమ్మాయి, అబ్బాయి ఈనెల 1న పెళ్లి చేసుకుని తప్పుడు ఆధార్ కార్డులతో మేజర్‌గా చూపించి రక్షణ కల్పించాలంటూ మేళ్లచెరువు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. ఈ క్రమంలో ఇరువురి కుటుంబసభ్యులను కలిసిన పోలీసులు.. అమ్మాయి - అబ్బాయి ఇబ్బందులు పెట్టొద్దంటూ కుటుంబ సభ్యులను మందలించి లేఖ రాయించుకున్నారు. ఈ క్రమంలో అమ్మాయి తల్లిదండ్రులు.. చదువు ధ్రువీకరణ పత్రాలతో మునగాల పోలీసులను ఆశ్రయించారు. దీంతో అసలు విషయం బయటపడింది. అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ మైనర్లుగా గుర్తించారు. ఈ క్రమంలో అబ్బాయిపై మునగాల పోలీస్ స్టేషన్‌లో పొస్కో చట్టం, కిడ్నాప్, హత్యాచారం కింద కేసు నమోదు అయ్యింది.