Minister Jagdish Reddy: ఆ విషయంలో దిక్కుతోచని పరిస్థితిలో ప్రతిపక్షాలు
ABN , First Publish Date - 2023-08-23T14:59:00+05:30 IST
బీఆర్ఎస్(BRS) ముందే అభ్యర్థులను ప్రకటించడంతో ప్రతిపక్ష నాయకులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని మంత్రి జగదీష్‌రెడ్డి(Minister Jagdish Reddy) అన్నారు.
సూర్యాపేట: బీఆర్ఎస్(BRS) ముందే అభ్యర్థులను ప్రకటించడంతో ప్రతిపక్ష నాయకులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని మంత్రి జగదీష్‌రెడ్డి(Minister Jagdish Reddy) అన్నారు. బుధవారంనాడు మంత్రి సూర్యాపేట(Suryapet)లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌లో టికెట్ రానివారిని కాంగ్రెస్, బీజేపీ(Congress, BJP) పార్టీలల్లో చేర్చుకోవడానికి నానా తాపాత్రయం పడుతున్నారని ఎద్దేవ చేశారు. 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎవరో చెప్పలేని పరిస్థితిలో ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా(Nalgonda District)లో మాది నెంబర్ వన్ టీం అని చెప్పారు.ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని చెప్పారు. కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేయడంపై ప్రతిపక్షాలు అనవసరపు రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి జగదీష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.