Home » Suspension
ఆ ఇద్దరూ శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు! వీరిలో ఒకరు మహిళా పారిశుఽధ్య కార్మికులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఆ దృశ్యాలను తనకు తానే ఫోన్లో వీడియో తీస్తాడు. తర్వాత ఆ వీడియోలను బాధిత మహిళలకు చూపి లైంగిక వేధింపులకు గురిచేస్తాడు.
గాజులరామారంలో ఫీల్డ్ ఆఫీసర్ కిషన్ లీలలు వెలుగులోకి వచ్చాయి. ఓ మహిళ పారిశుద్ద్య సిబ్బందిని లైంగికంగా వేధించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. బాధిత మహిళకు సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. దాంతో బాధితురాలు మీడియా ముందుకు వచ్చి జరిగిన మొత్తం చెప్పింది. మహిళను వేధించిన ఫీల్డ్ ఆఫీసర్‌పై గ్రేటర్ అధికారులు చర్యలు తీసుకున్నారు.
అక్రమాలకు పాల్పడిన ఇద్దరు మునిసిపల్ కమిషనర్లను సస్పెండ్ చేస్తూ బుధవారం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నిర్మల్ పురపాలక సంఘంలో జరిగిన పబ్లిక్ హెల్త్ వర్కర్ల నియామకాలకు సంబంధించి అప్పటి నిర్మల్ మునిసిపల్ కమిషనర్, ప్రస్తుత తుర్కయాంజల్ మునిసిపల్ కమిషనర్ బి. సత్యనారాయణ రెడ్డిని అధికారులు తొలగించారు.
పతంజలికి మరో షాక్ తగిలింది. పతంజలికి చెందిన 14 ఉత్పత్తులపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. పతంజలి ఉత్పత్తులకు సంబంధించి తప్పుదారి ప్రకటించే కేసు విషయంలో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలియజేసింది.
రాజస్థాన్‌లో ఓ మహిళ ఉపాధ్యాయురాలు అతిగా ప్రవర్తించారు. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా చదువుల తల్లి సరస్వతీ దేవి పట్ల అనుచితంగా బిహేవ్ చేశారు. ఈ పాఠశాలకు సరస్వతీ ఏం చేశారు..? విద్య కోసం ఏం చేశారని తన నోటి దూలను ప్రదర్శించారు.
సినీ నిర్మాత అంజిరెడ్డి హత్య కేసు విచారణలో పోలీసుల విచారణ తీరుపై అనుమానాలు వచ్చాయి. ఊహించినట్టుగానే నిర్మాత అంజిరెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోలేదని తెలిసింది. హత్య చేసి దానిని ప్రమాదంగా చిత్రీకరించారని ఆ తర్వాత జరిపిన విచారణలో తేటతెల్లం అయ్యింది. దీంతో గోపాలపురం ఏసీపీ సుధీర్ బాబును సస్పెండ్ చేశారు
ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీతో దురుసుగా ప్రవర్తించిన మహిళా కానిస్టేబుల్‌పై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఝాన్సీ జుట్టు లాగిన కానిస్టేబుల్ అయేషాను సస్పెండ్ చేశారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఉత్తర్వులు జారీచేశారు.
నాగపూర్ జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకులో నిధుల దుర్వినియోగానికి పాల్పడిన కేసులో దోషిగా నిర్ధారణ కావడంతో కాంగ్రెస్ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి సునీల్ కేదార్ మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి అనర్హతకు గురయ్యారు. రాష్ట్ర లెజిస్లేటివ్ సెక్రటేరియట్ ఈ మేరకు గెజిట్ ఉత్తర్వు జారీ చేసింది.
గత వారం లోక్‌సభలో జరిగిన భద్రతా ఉల్లంఘన పార్లమెంట్‌ను కుదిపేస్తోంది. గతవారం ఇద్దరు దుండగులు లోక్‌సభ ఛాంబర్లోకి ప్రవేశించి భయాందోళనలు కలిగించిన సంగతి తెలిసిందే. ఆ భద్రతా వైఫల్యంపై హోమ్ మంత్రి అమిత్ షా మాట్లాడాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్ట్ షేర్ చేసిన కొద్ది నిమిషాలకే కర్ణాటక స్కూల్ టీచర్ సస్పెండ్ అయ్యారు...