AP News: కాణిపాకం ఆలయ ప్రధాన అర్చకుడి సస్పెన్షన్
ABN , Publish Date - Oct 29 , 2024 | 01:28 PM
ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వయంభు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి(Kanipakam Varasiddhi Vinayaka Swamy) ఆలయ ప్రధాన అర్చకుడు సోమశేఖర్ గురుకుల్‌ను సస్పెండ్ చేసినట్లు సోమవారం సాయంత్రం ఈవో గురుప్రసాద్ తెలిపారు. తన పదోన్నతి కోసం తప్పుడు ధ్రువీకరణ పత్రాలను ఆలయానికి సమర్పించారంటూ సోమశేఖర్ గురుకుల్‌పై లాయర్ రవికుమార్ ఆరునెలల క్రితం దేవదాయ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
- ఇన్‌చార్జిగా గణేష్ గురుకుల్ నియామకం
ఐరాల(కాణిపాకం): ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వయంభు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి(Kanipakam Varasiddhi Vinayaka Swamy) ఆలయ ప్రధాన అర్చకుడు సోమశేఖర్ గురుకుల్‌ను సస్పెండ్ చేసినట్లు సోమవారం సాయంత్రం ఈవో గురుప్రసాద్ తెలిపారు. తన పదోన్నతి కోసం తప్పుడు ధ్రువీకరణ పత్రాలను ఆలయానికి సమర్పించారంటూ సోమశేఖర్ గురుకుల్‌పై లాయర్ రవికుమార్ ఆరునెలల క్రితం దేవదాయ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
ఈ వార్తను కూడా చదవండి: Chittoor: కల్యాణ ఘడియలు.. వచ్చే రెండు నెలల్లో 18 శుభ ముహూర్తాలు
దీంతో అప్పటి ఈవో వెంకటేశుకు తప్పుడు ధ్రువపత్రాల విషయాన్ని పరిశీలించి నివేదికను అందించాలని దేవదాయ శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో ఆలయంలో దేవదాయ శాఖ అధికారులు సోదాలు నిర్వహించగా ఆయన ఇచ్చిన ధ్రువీకరణ పత్రాలు తప్పుడు పత్రాలని తేలింది. అయితే సోమశేఖర్ గురుకుల్(Somasekhar Gurukul)కు అప్పటి ఆలయ ధర్మకర్తల మండలి అండ ఉండడంతో ఈవో ఏం చేయలేకపోయారు.
ఈ విషయంపై లాయర్ రవికుమార్ కోర్టులో దావా వేశారు. ఈ నేపథ్యంలో ఈవోగా వచ్చిన గురుప్రసాద్ దేవదాయ శాఖ ఉన్నతాధికారులకు నెల క్రితం ధ్రువీకరణ పత్రాలపై నివేదిక పంపించారు.దీంతో ఆలయ ప్రధాన అర్చకుడు సోమశేఖర్‌గురుకుల్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆలయ ఇన్‌చార్జి ప్రధాన అర్చకుడిగా ఎస్.ఎస్. గణేష్ గురుకుల్‌ను నియమిస్తూ దేవదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈవార్తను కూడా చదవండి: Food Poisoning: వామ్మో.. మోమోస్!
ఈవార్తను కూడా చదవండి: KTR: బుచ్చమ్మది.. రేవంత్ చేసిన హత్య
ఈవార్తను కూడా చదవండి: Madhuranagar: ‘ధరణి’తో మా ప్లాట్ల కబ్జా
ఈవార్తను కూడా చదవండి: Kaleshwaram Project: మేడిగడ్డతో ముంపు
Read Latest Telangana News and National News