Home » T20 WC 2024
టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఓవైపు కరేబీయన్ దీవుల్లో వర్షాలు పడుతుండటంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు ఉన్నాయి. ఈక్రమంలో మ్యాచ్‌పై ఎవరి అంచనాలు వారివి.
టీమిండియాకు కెప్టెన్సీ వహిస్తున్న ఆటగాళ్లు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వస్తున్నారు. గెలిచినప్పుడు ప్రశంసలు అందుకోవడంతో పాటు.. ఓడినప్పుడు అభిమానుల విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఈక్రమంలో రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా ఎన్నో చారిత్రక విజయాలను సాధించింది.
టీ20 ప్రపంచకప్ 2024 ఛాంపియన్ ఎవరనేది కొద్ది గంటల్లో తేలిపోనుంది. భారత్ రెండోసారి ఛాంపియన్‌గా నిలుస్తుందా.. మొదటిసారి కప్ గెల్చుకుని దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టిస్తుందా అని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
టీ20 ప్రపంచకప్ 2024(T20 World Cup 2024) రెండో సెమీఫైనల్‌లో భారత జట్టు(team india) గ్రాండ్ విక్టరీ సాధించింది. గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇంగ్లండ్‌పై(England) 68 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్ చేరుకుంది. దీంతో టీ20 ప్రపంచకప్ 2022 సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి పాలైన భారత్ ఈసారి మాత్రం ప్రతీకారం తీర్చుకుంది.
టీ20 ప్రపంచకప్ 2024 చాంఫియన్‌గా ఎవరు నిలవబోతున్నారనేది ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే మొదటి సెమీఫైనల్‌లో ఆప్ఘాన్‌పై ఘన విజయం సాధించిన దక్షిణాఫ్రికా ఫైనల్స్‌కు చేరుకోగా.. సఫారీలతో తలపడేదెవరనే ఉత్కంఠకు కొన్ని గంటల్లో తెరపడనుంది.
నేడు గురువారం (జూన్ 27, 2024) టీ20 ప్రపంచ కప్ 2024(T20 World Cup 2024)లో ఇండియా, ఇంగ్లండ్(India vs England) మధ్య కీలకమైన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. గయానా(Guyana)లోని ప్రొవిడెన్స్ స్టేడియంలో ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మొదలుకానుంది.
టీ20 వరల్డ్‌కప్ అంటే పరుగుల వరద పారుతుందని అంతా ఊహిస్తుంటారు. కానీ ఒక్కోసారి ఊహలకు అందని ఘటనలు చోటుచేసుకుంటాయి. భారీ స్కోర్ నమోదవుతుందని ఆశించినప్పుడు అతి తక్కువ స్కోర్ నమోదవడం చూస్తుంటాం.
టీ20 క్రికెట్ ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టించింది. తొలిసారి ఆ జట్టు ఫైనల్స్ చేరింది. 2007లో మొదటి టీ20 ప్రపంచకప్ దక్షిణాఫ్రికా వేదికగా జరగ్గా.. ఆ సంవత్సరం భారత్ ఛాంపియన్‌గా నిలిచింది.
టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్స్‌కు చేరి చరిత్ర సృష్టించిన ఆప్ఘానిస్తాన్.. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్స్ మ్యాచ్‌లో చెత్త రికార్డును సొంతం చేసుకుంది. కనీసం 12 ఓవర్లు ఆడకుండానే 56 పరుగులకు ఆలౌటైంది.
టీ20 ప్రపంచ కప్ 2024(T20 World Cup 2024)లో అఫ్ఘనిస్తాన్(Afghanistan) జట్టు చరిత్ర సృష్టించింది. రషీద్ ఖాన్(rashid khan) నేతృత్వంలోని ఈ జట్టు అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఆస్ట్రేలియా(Australia)ను ఓడించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది.