T20 World Cup: ఫైనల్స్‌కు సౌతాఫ్రికా.. ఆప్ఘాన్‌పై ఘన విజయం..
ABN , Publish Date - Jun 27 , 2024 | 08:10 AM
టీ20 క్రికెట్ ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టించింది. తొలిసారి ఆ జట్టు ఫైనల్స్ చేరింది. 2007లో మొదటి టీ20 ప్రపంచకప్ దక్షిణాఫ్రికా వేదికగా జరగ్గా.. ఆ సంవత్సరం భారత్ ఛాంపియన్‌గా నిలిచింది.
టీ20 క్రికెట్ ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టించింది. తొలిసారి ఆ జట్టు ఫైనల్స్ చేరింది. 2007లో మొదటి టీ20 ప్రపంచకప్ దక్షిణాఫ్రికా వేదికగా జరగ్గా.. ఆ సంవత్సరం భారత్ ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పటివరకు 8 సార్లు టీ20 ప్రపంచకప్ జరగ్గా దక్షిణాఫ్రికా ఒక్కసారి కూడా ఫైనల్స్ చేరుకోలేదు. 2024లో సెమీఫైనల్స్‌లో ఆప్ఘానిస్తాన్‌పై ఘన విజయం సాధించి ఫైనల్స్ చేరింది. ఈరోజు రాత్రి ఇంగ్లాడ్, భారత్ మధ్య జరిగే రెండో సెమీఫైనల్స్ మ్యాచ్‌లో విజేతతో దక్షిణాఫ్రికా ఫైనల్స్ ఆడనుంది.
T20 WC India vs England : లెక్క సరిచేస్తారా!
తొలిసారి..
ట్రినిడాడ్ వేదికగా ఆప్ఘానిస్తాన్, సౌతాఫ్రికా మధ్య మొదటి సెమీఫైనల్స్‌లో టాస్ గెలిచిన ఆప్ఘాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆప్ఘానిస్తాన్‌కు ఓపెనర్లు శుభారంభాన్నివ్వలేదు. మొదటి ఓవర్‌లోనే తొలి వికెట్ కోల్పోయిన ఆప్ఘానిస్తాన్ వరుసగా వికెట్లు కోల్పోయింది. అజ్మతుల్లా ఒమర్జాయ్ మాత్రమే అత్యధికంగా పది పరుగులు చేశారు. మిగిలిన బ్యాటర్లు ఎవరూ కనీసం డబుల్ డిజిట్ దాటలేదు. ముగ్గురు బ్యాట్స్‌మెన్స్ పరుగులేమి చేయకుండానే డకౌట్ చేరారు. తొలిసారి వరల్డ్ కప్ సెమీస్‌కు చేరిన ఆప్ఘానిస్తాన్ మరో చరిత్ర సృష్టించి ఫైనల్స్‌కు చేరుతుందని అంతా అంచనా వేశారు. కానీ సౌతాఫ్రికా బౌలర్ల దాటికి 56 పరుగులకే ఆప్ఘానిస్తాన్ ఆలౌటైంది. 57 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 8.5 ఓవర్లలో చేధించింది. ఒక వికెట్ నష్టానికి దక్షిణాఫ్రికా 8.5 ఓవర్లలో 60 పరుగులు చేసింది. దీంతో తొలిసారి దక్షిణాఫ్రికా టీ20 వరల్డ్‌కప్ ఫైనల్స్‌కు చేరింది.
ఇద్దరికి మూడేసి వికెట్లు..
దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్, షమ్సీ చెరో మూడు వికెట్లు తీయగా.. రబడా, నోకియా చెరో రెండు వికెట్లు తీశారు. ఆప్ఘానిస్తాన్ బ్యాటర్లలో ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోవడంతో అతి తక్కువ స్కోర్‌కే కుప్పకూలింది.
Virat Kohli: ఇదీ.. విరాట్ కోహ్లీ క్రేజ్.. న్యూయార్క్‌లో లార్జర్ దాన్ లైఫ్ విగ్రహం!
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Sports News and Latest Telugu News