Share News

T20 World Cup: భారత్- ఇంగ్లాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్‌కు వరుణ గండం.. రద్దైతే ఫైనల్ చేరేదెవరంటే..

ABN , Publish Date - Jun 27 , 2024 | 02:00 PM

టీ20 ప్రపంచకప్‌ 2024 చాంఫియన్‌గా ఎవరు నిలవబోతున్నారనేది ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే మొదటి సెమీఫైనల్‌లో ఆప్ఘాన్‌పై ఘన విజయం సాధించిన దక్షిణాఫ్రికా ఫైనల్స్‌కు చేరుకోగా.. సఫారీలతో తలపడేదెవరనే ఉత్కంఠకు కొన్ని గంటల్లో తెరపడనుంది.

T20 World Cup: భారత్- ఇంగ్లాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్‌కు వరుణ గండం.. రద్దైతే ఫైనల్ చేరేదెవరంటే..
IND vs ENG

టీ20 ప్రపంచకప్‌ 2024 చాంఫియన్‌గా ఎవరు నిలవబోతున్నారనేది ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే మొదటి సెమీఫైనల్‌లో ఆప్ఘాన్‌పై ఘన విజయం సాధించిన దక్షిణాఫ్రికా ఫైనల్స్‌కు చేరుకోగా.. సఫారీలతో తలపడేదెవరనే ఉత్కంఠకు కొన్ని గంటల్లో తెరపడనుంది. భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి 8 గంటలకు భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగే రెండో సెమీఫైనల్స్‌లో గెలిచిన జట్టు ఫైనల్స్‌కు చేరుతుంది. దీంతో ఇవాల్టి సెమీఫైనల్ మ్యాచ్‌పై అందరి దృష్టి పడింది. మరోవైపు భారత్, ఇంగ్లాండ్ మ్యాచ్‌ జరిగే గుయనాలో వాతావరణం ఎలా ఉందనే టెన్షన్ ప్రతి ఒక్కరిలో నెలకొంది. ఇప్పటికే వాతావరణం కారణంగా టీ20 ప్రపంచకప్‌లో పలు లీగ్ మ్యాచ్‌లు రద్దయ్యాయి. దీంతో సెమీఫైనల్ మ్యాచ్‌ జరుగుతుందా లేదా అనే ఉత్కంఠ క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. ఈ మ్యాచ్‌కు వర్షం గండం పొంచి ఉందన్న వార్తలు ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటివరకు వాతావరణం పొడిగానే ఉన్నట్లు అక్కడి గుయనా వాతావరణ అధికారులు తెలిపారు. కానీ మ్యాచ్‌ ప్రారంభమయ్యేసమయానికి చిరుజల్లులతో మొదలై.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. సెమీఫైనల్‌కు రిజర్వ్‌డే లేనందున క్రికెట్‌ ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

T20 WC India vs England : లెక్క సరిచేస్తారా!


మ్యాచ్ రద్దైతే..

టీ20 వరల్డ్ కప్‌లో ఏదైనా మ్యాచ్ వర్షం లేదా ఇతర కారణాలతో రద్దైతే ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు. అయితే ప్రస్తుతం లీగ్, సూపర్ 8 దశలు ముగిసి సెమీఫైనల్‌కు చేరుకోవడంతో పాయింట్లను కేటాయించడం సాధ్యపడదు. రెండు జట్లలో ఒక జట్టు మాత్రమే ఫైనల్స్‌కు వెళ్లే అవకాశం ఉంది. దీంతో మ్యాచ్ జరిగితే గెలిచన జట్టు నేరుగా ఫైనల్స్ చేరుతుంవది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే మాత్రం మరోసారి మ్యాచ్ నిర్వహించే అవకాశం లేదు. సెమీఫైనల్ మ్యాచ్‌కు రిజర్వుడే లేకపోవడంతో మ్యాచ్ రద్దవుతుంది. అదే జరిగితే భారత్ తన పాయింట్లు, నెట్ రన్ రేట్ ఆధారంగా ఫైనల్స్ చేరుతుంది. సూపర్‌-8లో భారత్‌ గ్రూప్‌-1లో అగ్రస్థానంలో నిలవడంతో మ్యాచ్ రద్దైతే మాత్రం భారత్ ఫైనల్స్ చేరుతుంది.


Virat Kohli: ఇదీ.. విరాట్ కోహ్లీ క్రేజ్.. న్యూయార్క్‌లో లార్జర్ దాన్ లైఫ్ విగ్రహం!

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Sports News and Latest Telugu News

Updated Date - Jun 27 , 2024 | 02:07 PM