T20 World Cup 2024: ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించిన అఫ్ఘనిస్తాన్.. సరికొత్త రికార్డు
ABN , Publish Date - Jun 23 , 2024 | 09:58 AM
టీ20 ప్రపంచ కప్ 2024(T20 World Cup 2024)లో అఫ్ఘనిస్తాన్(Afghanistan) జట్టు చరిత్ర సృష్టించింది. రషీద్ ఖాన్(rashid khan) నేతృత్వంలోని ఈ జట్టు అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఆస్ట్రేలియా(Australia)ను ఓడించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది.
టీ20 ప్రపంచ కప్ 2024(T20 World Cup 2024)లో అఫ్ఘనిస్తాన్(Afghanistan) చరిత్ర సృష్టించింది. రషీద్ ఖాన్(rashid khan) నేతృత్వంలోని ఈ జట్టు అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఆస్ట్రేలియా(Australia)ను ఓడించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్ఘనిస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. రహ్మానుల్లా గుర్బాజ్ 60 పరుగులు, ఇబ్రహీం జద్రాన్ 51 పరుగులు చేశారు. అనంతరం ఆస్ట్రేలియా 19.2 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. గుల్బాదిన్ నైబ్ అద్భుతంగా బౌలింగ్ వేసి 4 వికెట్లు తీశాడు. దీంతో అప్ఘాన్ జట్టు 21 పరుగుల తేడాతో ఆసీస్‌పై థ్రిల్లింగ్ విజయం సాధించింది.
ఇరు జట్ల మధ్య వన్డేల్లో నాలుగు, టీ20ల్లో రెండు మ్యాచ్‌లు జరిగాయి. అఫ్ఘనిస్తాన్(Afghanistan) జట్టు ఆస్ట్రేలియాపై వన్డేల్లో ఎప్పుడూ విజయం సాధించలేదు. ఈ క్రమంలోనే టీ20 రెండో మ్యాచ్‌లో అఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియాను ఓడించి చరిత్ర సృష్టించడం విశేషం. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆరంభంలో 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత మార్కస్ స్టోయినిస్‌తో కలిసి గ్లెన్ మాక్స్‌వెల్ 39 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. స్టోయినిస్‌ను అవుట్ చేయడం ద్వారా నాయబ్ ఈ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు. ఇక్కడి నుంచి మ్యాచ్ పూర్తిగా మలుపుతిరిగింది.
మ్యాక్స్‌వెల్(maxwell) మినహా ఏ ఆటగాడు కూడా 15 కంటే ఎక్కువ పరుగులు చేయలేకపోయారు. ట్రావిస్ హెడ్ (0), డేవిడ్ వార్నర్ (3), కెప్టెన్ మిచెల్ మార్ష్ (12), మార్కస్ స్టోయినిస్ (11), టిమ్ డేవిడ్ (2), మాథ్యూ వేడ్ (5), పాట్ కమిన్స్ (3), అష్టన్ అగర్ (2), ఆడమ్ జంపా (9) చొప్పున పరుగులు చేశారు.
కాగా ఇదే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ చరిత్ర సృష్టించాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో రెండవ హ్యాట్రిక్ వికెట్లు సాధించిన తొలి బౌలర్‌గా నిలిచాడు. అయితే ఈ హ్యాట్రిక్ వికెట్లు ఆస్ట్రేలియాను గెలిపించలేకపోయాయి.
అఫ్ఘానిస్తాన్(Afghan) సాధించిన ఈ విజయంతో సూపర్-8 దశ గ్రూప్-1లో సెమీఫైనల్ పోరు ఉత్కంఠగా మారనుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా, అఫ్ఘనిస్తాన్ చెరో రెండేసి పాయింట్లతో ఉన్నాయి. ఆస్ట్రేలియా తన చివరి సూపర్-8 మ్యాచ్‌ని భారత్‌తో, అఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్‌తో ఆడాల్సి ఉంది. రెండు జట్లూ గెలవాలి. ఇద్దరూ ఓడిపోతే నెట్ రన్ రేట్ పరిగణలోకి తీసుకుంటారు.
ఇది కూడా చదవండి:
Virat Kohli: వరల్డ్ కప్‌లో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. మొట్టమొదటి ఆటగాడిగా అవతరణ
Money Saving Tips: నెలకు రూ. 20 వేలు 5 ఏళ్లు చెల్లిస్తే.. కోటీశ్వరులు అయ్యే ఛాన్స్..!
Read Latest Sports News and Telugu News