Home » Tadipatri
తాడిప్రతి మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్ తగలింది. బీఎస్-IV వాహనాల మనీ లాండరింగ్ ప్రభాకర్ రెడ్డిపై ED ఛార్జ్‌షీట్ ఫైల్ చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం విశాఖపట్నంలోని ప్రత్యేక కోర్టులో ఈ కేసుకు సంబంధించి 17 మంది నిందితులు, సంస్థలపై ప్రాసిక్యూషన్ ఫిర్యాదును హైదరాబాద్‌లోని డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ దాఖలు చేసింది.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు నిన్న(సోమవారం) పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే పోలింగ్ సమయంలో వైసీపీ (YSRCP) పలు అల్లర్లు, అరాచకాలు సృష్టించింది. పలు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైసీపీ మూకలు పెద్దఎత్తున దాడులకు పాల్పడుతున్నాయి. అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో మరోసారి వైసీపీ అల్లరి మూకలు దాడులకు తెగడుతున్నాయి. తాడిపత్రి పట్టణంలో తెలుగుదేశం పార్టీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడులకు పాల్పడ్డారు.
ఎన్నికల ప్రచారంలో సీఎం జగన ‘పేలవ ప్రదర్శన’ కొనసాగుతోంది. వైసీపీని మరోసారి అధికారంలోకి తీసుకువస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, టీడీపీ అధికారంలోకి వస్తే ఆగిపోతాయని జనాన్ని బెదిరించి, లబ్ధి పొందేందుకు ప్రయత్నించారు. తాడిపత్రి వైఎస్సార్ సర్కిల్లో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99 శాతం నెరవేర్చామని అన్నారు. నవరత్నాల్లోని అన్ని పథకాలను అమలు చేశామని అన్నారు. కానీ ప్రత్యేక హోదా, మద్యపాన నిషేధం, పోలవరం ప్రాజెక్ట్, సీపీఎస్ రద్దు, మెగా...
అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి.. నేటి నుంచి తాడిపత్రి నియోజకవర్గంలో బస్సుయాత్ర
Andhrapradesh: తాడిపత్రిలో మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెను భగ్నం చేసేందుకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రంగంలోకి దిగారు. ప్రైవేటు వ్యక్తులతో వీధుల్లో చెత్తను తొలగించేందుకు పెద్దారెడ్డి రోడ్డుపైకి వచ్చారు. అయితే తాడపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి వైఖరిని నిరసిస్తూ అడ్డుకునేందుకు మున్సిపల్ కార్మికులు ప్రయత్నించారు.
తాడిపత్రి ( Tadipatri ) లోని సీబీ రోడ్డులో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ( JC Prabhakar Reddy ) ఆందోళనకు దిగారు. నూతన సంవత్సర వేడుకల కోసం డివైడర్ల మధ్య ఉన్న విద్యుత్ స్తంభాలకు మునిసిపల్ ఉద్యోగులు విద్యుత్తు దీపాలు అలంకరిస్తున్నారు. అడ్డుగా ఉన్న వైసీపీ జెండాలను మున్సిపల్ సిబ్బంది తొలగించడానికి ప్రయత్నం చేశారు.
జిల్లా ఎస్పీని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి శుక్రవారం కలిశారు. అనంతరం జేసీ మీడియాతో మాట్లాడుతూ.. దీపావళి శుభాకాంక్షలు తెలిపేందుకు మాత్రమే వచ్చానని చెప్పారు.
తాడిపత్రి(Tadipatri) ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి( MLA Ketireddy Peddareddy) తాను లేని సమయంలో ఇంటికి వచ్చి కూర్చున్న సంఘటన తర్వాత ఉరేసుకుని చద్దామనుకున్నానని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ సోదరుల్లో ఒకరైన ప్రభాకర్‌రెడ్డి (Prabhakar Reddy) వ్యాఖ్యానించారు.
పోలీసులపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
తాడిపత్రిలో జూనియర్ కళాశాల ప్రహరీ గోడ నిర్మాణం విషయంలో గత వారం రోజులుగా టెన్షన్ వాతావరం నెలకొన్న విషయం తెలిసిందే.