MLA Kethireddy: మున్సిపల్ కార్మికుల సమ్మె భగ్నానికి రంగంలోకి కేతిరెడ్డి.. దగ్గరుండి మరీ చెత్తను..
ABN , Publish Date - Jan 04 , 2024 | 10:47 AM
Andhrapradesh: తాడిపత్రిలో మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెను భగ్నం చేసేందుకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రంగంలోకి దిగారు. ప్రైవేటు వ్యక్తులతో వీధుల్లో చెత్తను తొలగించేందుకు పెద్దారెడ్డి రోడ్డుపైకి వచ్చారు. అయితే తాడపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి వైఖరిని నిరసిస్తూ అడ్డుకునేందుకు మున్సిపల్ కార్మికులు ప్రయత్నించారు.
అనంతపురం, జనవరి 4: తాడిపత్రిలో మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెను భగ్నం చేసేందుకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి(MLA Kethireddy Peddareddy) రంగంలోకి దిగారు. ప్రైవేటు వ్యక్తులతో వీధుల్లో చెత్తను తొలగించేందుకు పెద్దారెడ్డి రోడ్డుపైకి వచ్చారు. అయితే తాడపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి వైఖరిని నిరసిస్తూ అడ్డుకునేందుకు మున్సిపల్ కార్మికులు ప్రయత్నించారు. ఎమ్మెల్యేను అడ్డుకుంటున్న మున్సిపల్ కార్మికులను పోలీసులు ఈడ్చిపారేశారు. దీంతో దగ్గరుండి మరి తాడిపత్రి ఎమ్మెల్యే చెత్తను తొలగిస్తున్నారు.
ఎమ్మెల్యే వైఖరిపై మున్సిపల్ కార్మికులు తీవ్ర అసహనాన్ని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డితో మున్సిపల్ కార్మికులు వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డిని సీఐటీయు నేతలు, మున్సిపల్ కార్మికులు అడ్డుకుని దిగ్బంధించారు. ఎమ్మెల్యేను అడ్డుకున్న నేతలు, కార్మికులను పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు.
పది రోజులుగా సమ్మె చేస్తున్నా...
తమ డిమాండ్లు పరిష్కారించాలంటూ గత పది రోజులుగా రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ప్రతీ రోజు వినూత్న రీతుల్లో సమ్మె చేస్తూ తమ నిరసనను తెలియజేస్తున్నారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని మున్సిపల్ కార్మికులు స్పష్టం చేశారు. ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పటికీ అవి విఫలకావడంతో మున్సిపల్ కార్మికులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, నాన్ పీహెచ్ కేటగిరి ఉద్యోగులకు హెల్త్ అలవెన్స్ రూ.6 వేలు ఇవ్వాలని, మున్సిపల్ కార్మికులను క్రమబద్ధీకరించాలనే ప్రధాన డిమాండ్లను కార్మిక సంఘాల నేతలు.. మంత్రుల ముందు ఉంచగా.. అందులో కొన్ని మాత్రమే పరిష్కరిస్తామని మంత్రులు చెప్పారు.
దీంతో సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని మున్సిపల్ కార్మికులు స్పష్టం చేశారు. మున్సిపల్ కార్మికుల సమ్మెతో రాష్ట్రంలో చెత్త ఎక్కడికక్కడ నిలిచిపోయింది. కార్మికుల సమ్మెతో ఇళ్ల నుంచి చెత్త సేకరణ, వీధులు, కాలువలు శుభ్రం చేసే పనులు నిలిచిపోయాయి. దీంతో సమ్మెకు వెళ్లని, పర్మినెంట్ కార్మికులతో చెత్త శుభ్రం చేయించేలా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. వీరిని సమ్మె చేస్తున్న మున్సినల్ కార్మికులు అడ్డుకోవడంతో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..