JC: నాపై కేసులు పూర్తవ్వాలంటే మూడు జన్మలు కావాలేమో?.
ABN , First Publish Date - 2023-11-10T14:29:44+05:30 IST
జిల్లా ఎస్పీని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి శుక్రవారం కలిశారు. అనంతరం జేసీ మీడియాతో మాట్లాడుతూ.. దీపావళి శుభాకాంక్షలు తెలిపేందుకు మాత్రమే వచ్చానని చెప్పారు.
అనంతపురం: జిల్లా ఎస్పీని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి (Tadipatri Municipal Chairman JC Prabhakar Reddy) శుక్రవారం కలిశారు. అనంతరం జేసీ మీడియాతో మాట్లాడుతూ.. దీపావళి శుభాకాంక్షలు తెలిపేందుకు మాత్రమే వచ్చానని చెప్పారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం లేదని... తాడేపల్లి రాజ్యాంగం ఉందని వ్యాఖ్యలు చేశారు. ‘‘నాపై పెట్టిన కేసులన్నీ పూర్తి కావాలంటే మూడు జన్మలు కావాలి. ఇప్పటికే నాకు 73 ఏళ్ల వయసు ఆ కేసులన్నీ ఎప్పటికీ క్లియర్ అవుతాయి. పుట్లూరు, యల్లనూరు మండలాల్లో భారీగా దొంగ ఓట్లు చేర్చారు. ఆ రెండు మండలాలు తహసిల్దార్లు జాగ్రత్తగా వ్యవహరించాలి. మాకు ఈ ఎన్నికలు చాలా లైఫ్ అండ్ డెత్ లాంటివి. అందుకే చాలా సీరియస్‌గా తీసుకున్నాం.. ఎక్కడ ఏ తప్పిదం జరిగినా ఊరుకోం. ఎన్ని కేసులు వచ్చినా వెనక్కి తగ్గేది లేదు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఏ మాత్రం తమ పరిధిలో పనిచేయడం లేదు’’ అంటూ జేసీ విమర్శలు గుప్పించారు.