Share News

Andhra Pradesh: టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి షాక్.. ఛార్జ్ షీట్ ఫైల్..

ABN , Publish Date - May 14 , 2024 | 10:06 PM

తాడిప్రతి మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌ రెడ్డికి బిగ్ షాక్ తగలింది. బీఎస్-IV వాహనాల మనీ లాండరింగ్‌ ప్రభాకర్‌ రెడ్డిపై ED ఛార్జ్‌షీట్ ఫైల్‌ చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం విశాఖపట్నంలోని ప్రత్యేక కోర్టులో ఈ కేసుకు సంబంధించి 17 మంది నిందితులు, సంస్థలపై ప్రాసిక్యూషన్ ఫిర్యాదును హైదరాబాద్‌లోని డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దాఖలు చేసింది.

Andhra Pradesh: టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి షాక్.. ఛార్జ్ షీట్ ఫైల్..
JC Prabhakar Reddy

తాడిప్రతి మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌ రెడ్డికి బిగ్ షాక్ తగలింది. బీఎస్-IV వాహనాల మనీ లాండరింగ్‌ ప్రభాకర్‌ రెడ్డిపై ED ఛార్జ్‌షీట్ ఫైల్‌ చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం విశాఖపట్నంలోని ప్రత్యేక కోర్టులో ఈ కేసుకు సంబంధించి 17 మంది నిందితులు, సంస్థలపై ప్రాసిక్యూషన్ ఫిర్యాదును హైదరాబాద్‌లోని డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దాఖలు చేసింది. బీఎస్-IV నిబంధనలకు అనుగుణంగా లేని వాహనాలను 2017 ఏప్రియల్ 1నుంచి దేశంలో విక్రయించరాదని, రిజిస్ట్రేషన్ చేయకూడదని సుప్రీంకోర్టు ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘించి JC ప్రభాకర్ రెడ్డి, C. గోపాల్ రెడ్డితో పాటు పలువురు వ్యక్తులు అశోక్ లీలాండ్ లిమిటెడ్ నుండి BS-3 వాహనాలను జటాధార ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, C. గోపాల్ రెడ్డి అండ్ కో పేరుతో భారీ తగ్గింపుతో కొనుగోలు చేసి, మోసపూరితంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్న ఆరోపణలతో కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించి ఇవాళ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.

AP Elections 2024: సీఎం జగన్ కుట్రను భగ్నం చేసిన ఎన్నికల కమిషన్..


కేసు ఏమిటంటే..

తప్పుడు పత్రాలతో బీఎస్-3 వావాహనాలను BS-4 వాహనాలుగా అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. అక్రమ రిజిస్ట్రేషన్లలో ఎక్కువ భాగం నాగాలాండ్‌లో జరిగాయని, కొన్ని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోనూ జరిగినట్లు తెలిపింది. జటాధార ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట 50 వాహనాలు, సి.గోపాల్ రెడ్డి పేరిట 104 వాహనాలు రిజిస్టర్ అయినట్లు ఈడీ విచారణలో తేలిందని ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి, సీ గోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన 68 కోట్ల చరాస్తులు, 28.6 కోట్ల రూపాయల స్థిరాస్తులను ED అటాచ్ చేసింది.


AP Election 2024: కూటమి గెలుపునకు వైసీపీ కారణం..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest Andhra Pradesh News and Telugu News

Updated Date - May 14 , 2024 | 10:06 PM