Home » TATA Group
అయోధ్యలో మ్యూజియం ఆఫ్ టెంపుల్స్ నిర్మాణానికి టాటా సన్స్(TATA Sons) చేసిన ప్రతిపాదనకు యోగీ ఆదిత్యనాథ్(CM Yogi Adityanath) సర్కార్ అంగీకారం తెలిపింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన మంగళవారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో రూ.650 కోట్లతో మ్యూజియం ఆఫ్ టెంపుల్స్(Museum of Temples) నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
టైమ్ మ్యాగజైన్(TIME Magazine) 2024కి గానూ ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 కంపెనీల జాబితాను విడుదల చేసింది. ఇందులో భారత్‌కి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industries), టాటా గ్రూప్(TATA Group), సీరమ్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి.
అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్‌కు చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరికి బుధవారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి.
మూకుమ్మడి సెలవులు పెట్టిన సిబ్బందిపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ క్రమశిక్షణ చర్యలు ప్రారంభించింది. సాయంత్రానికి ఉద్యోగులు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.
టాటాగ్రూప్ టేకోవర్ చేసిన విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సిబ్బంది మూకుమ్మడి సెలవులు పెట్టడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా 90కిపైగా విమానాలు రద్దయ్యాయి.
దేశీయ విమాన సర్వీసుల్లో ఎకానమీ క్లాసులో ఉచిత బ్యాగేజీ పరిమితిని తగ్గిస్తూ టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ నిర్ణయం తీసుకుంది.
కపై టెస్లా(tesla) కార్లలో టాటా సెమీకండక్టర్ చిప్స్(semiconductor chips) రానున్నాయా? నమ్మశక్యంగా లేదా? కానీ ప్రస్తుతం అలాంటి సంకేతాలే వినిపిస్తున్నాయి. టెస్లా తన గ్లోబల్ కార్యకలాపాలలో ఉపయోగించే సెమీకండక్టర్ చిప్‌లను కొనుగోలు చేయడానికి టాటా ఎలక్ట్రానిక్స్(Tata Electronics)తో వ్యూహాత్మక ఒప్పందంపై సంతకం చేసినట్లు తెలుస్తోంది.
ప్రైవేటు సంస్థల్లో ఎప్పుడైనా ఉద్యోగులకు(employees) ఇళ్లు(houses) కట్టించి ఇవ్వడం చూశారా. లేదా అయితే ఇప్పుడు తెలుసుకోండి. ఎందుకంటే ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్(apple) ఇప్పుడు భారతదేశంలో ఇళ్లను నిర్మించబోతోంది. ఏకంగా 78,000 కంటే ఎక్కువ హౌసింగ్ యూనిట్లను నిర్మించాలని కంపెనీ యోచిస్తోంది.
ఫైలట్లు, సిబ్బంది కొరత సహా ఇతర కారణాల వల్ల విమానాలను తగ్గిస్తున్నామని విస్తారా ఎయిర్ లైన్స్ సోమవారం నాడు ఒక ప్రకటనలో తెలిపింది. గత కొన్నిరోజులుగా విమానాల ఆలస్యానికి గల కారణం ఇదేనని కంపెనీ ప్రతినిధి ఒకరు వివరించారు. కొన్ని దేశీయ మార్గాలలో ఎక్కువ మంది ప్రయాణికులను గమ్యస్థానం చేర్చేందుకు బోయింగ్ 787 లాంటి పెద్ద విమానాల ద్వారా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు.
చిప్స్ ఫర్ విక్షిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా రూ. 1.25 లక్షల కోట్ల విలువైన మూడు సెమీకండక్టర్ ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ(narendra Modi) ఈరోజు(మార్చి 13న) శంకుస్థాపన చేశారు.