Share News

Trending Stock: ఇన్వెస్టర్ల పంట పండింది.. ఏడాదిలో 77% లాభాలను ఇచ్చిన షేర్లు..

ABN , Publish Date - Aug 01 , 2024 | 06:49 PM

ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్(Tata Motors) అదరగొడుతోంది. దేశంలో విభిన్న పరిస్థితులు కొనసాగుతున్న వేళ కూడా లాభాల దిశగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఈ కంపెనీ షేర్లు ఏడాదిలోనే భారీగా పుంజుకున్నాయి. దీంతో మదుపర్లకు పెద్ద ఎత్తున లాభాలు వచ్చాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

Trending Stock: ఇన్వెస్టర్ల పంట పండింది.. ఏడాదిలో 77% లాభాలను ఇచ్చిన షేర్లు..
investors 77% profit

ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్(Tata Motors) అదరగొడుతోంది. దేశంలో విభిన్న పరిస్థితులు కొనసాగుతున్న వేళ కూడా లాభాల దిశగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే 2024-25 మొదటి ఆర్థిక సంవత్సరం త్రైమాసికంలో రూ. 5,566 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఈ క్రమంలో వార్షిక ప్రాతిపదికన 74% పెరగడం విశేషం. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.3,203 కోట్ల లాభాన్ని ఆర్జించింది. కంపెనీ ఈరోజు (గురువారం, ఆగస్టు 1) తొలి త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో కంపెనీ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రూ.1.08 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఏడాది క్రితం కూడా ఇదే త్రైమాసికంలో టాటా మోటార్స్ రూ.1.02 లక్షల కోట్లు ఆర్జించడం విశేషం.


ఏడాదిలో 77 శాతం లాభం

ఇదే సమయంలో టాటా మోటార్స్ షేర్లు కూడా భారీగా పెరిగి ఇన్వెస్టర్లకు(investors) కాసుల వర్షం కురిపించాయి. ఈరోజు (గురువారం, ఆగస్టు 1) 1.21% పడిపోయిన తర్వాత ఈ కంపెనీ షేరు ధర రూ.1,142.65కు చేరుకుంది. కానీ సంస్థ షేర్లు గత 5 రోజుల్లో 5.26% పెరిగాయి. ఒక నెలలో 14.03%, 6 నెలల్లో 30.07% పంజుకున్నాయి. ఆ క్రమంలో ఒక సంవత్సరంలో ఈ కంపెనీ షేర్లు 77.53% రాబడిని అందించడం విశేషం.

అంటే ఏడాది క్రితం ఈ కంపెనీలోని షేర్లలో 10 లక్షల పెట్టుపడి చేసిన వారికి ఇప్పుడు దాదాపు 18 లక్షలు వచ్చాయని చెప్పవచ్చు. అంతేకాదు టాటా మోటార్స్ షేర్లు ఈ సంవత్సరం జనవరి 1, 2024 నుంచి ఇప్పటి వరకు 44.53% పెరిగాయి. దీంతో ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ విలువ రూ.4.20 లక్షల కోట్లకు చేరుకుంది.


రెండు కంపెనీలుగా

ఈ క్రమంలోనే టాటా మోటార్స్ లిమిటెడ్ (TML) బోర్డు సభ్యులు ఈరోజు(ఆగస్టు 1న) జరిగిన సమావేశంలో కంపెనీని రెండు లిస్టెడ్ కంపెనీలుగా విడదీసే ప్రణాళికను ఆమోదించారు. విభజన తర్వాత, టాటా మోటార్స్ రెండు వేర్వేరు లిస్టెడ్ కంపెనీలుగా విభజించబడుతుంది. దీని ప్రక్రియ వచ్చే 12 నుంచి 15 నెలల్లో పూర్తవుతుందని కంపెనీ తన స్టాక్ ఎక్స్ఛేంజ్(stock exchange) ఫైలింగ్‌లో పేర్కొంది. ఇది కాకుండా టాటా క్యాపిటల్‌తో టాటా మోటార్స్ ఫైనాన్స్ విలీనం ప్రక్రియ కూడా కొనసాగుతోంది. వచ్చే 9 నుంచి 12 నెలల్లో ఇది పూర్తవుతుందని ప్రకటించారు.

టాటా మోటార్స్ విభజన తర్వాత టాటా మోటార్స్ వాణిజ్య వాహనాల వ్యాపారం ఒక ప్రత్యేక సంస్థలో చేర్చబడుతుంది. రెండవ సంస్థలో ప్రయాణీకుల వాహనాలు, ఎలక్ట్రికల్ వాహనాలు, JLR దాని సంబంధిత పెట్టుబడులను కలిపి ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేస్తారు. విభజన ప్రక్రియలో టాటా మోటార్స్ వాటాలను కలిగి ఉన్న వాటాదారులు టాటా మోటార్స్ ప్యాసింజర్, వాణిజ్య వాహనాల కంపెనీల వాటాలను పొందుతారు.


ఇవి కూడా చదవండి:

Zomato: పుంజుకున్న జొమాటో.. రూ.2 కోట్ల నుంచి రూ.253 కోట్లకు..

Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..


ITR Filling: ఐటీఆర్ దాఖలుకు నేడే లాస్ట్ ఛాన్స్.. గడువు పెంచుతారా, క్లారిటీ

Read More Business News and Latest Telugu News

Updated Date - Aug 01 , 2024 | 06:51 PM