Home » TATA IPL2023
ఎంతో ఆసక్తికరంగా సాగిన ఐపీఎల్-16 తుది అంకానికి చేరుకుంది. ఆదివారం గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.
దాదాపు రెండు నెలలుగా క్రికెట్ ప్రేమికులకు మజాను అందించిన ఐపీఎల్-16 టైటిల్ పోరుకు సిద్ధమైంది. ఈ రోజు (ఆదివారం) సాయంత్రం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఫైనల్ పోరులో (IPL 2023 Final Match) చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ (CSKvsGT) జట్లు తలపడబోతున్నాయి.
అత్యంత ఆసక్తికరంగా సాగిన ఐపీఎల్ కీలక పోరుకు సిద్ధమైంది. ఈ రోజు (ఆదివారం) సాయంత్రం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఫైనల్ పోరులో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడబోతున్నాయి.
దాదాపు రెండు నెలలుగా క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగిస్తున్న ఐపీఎల్ తుది దశకు చేరుకుంది. ఈ రోజు (ఆదివారం) సాయంత్రం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఫైనల్ పోరులో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడబోతున్నాయి.
టీమిండియా కెప్టెన్, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టును నడిపిస్తున్న రోహిత్ శర్మపై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హెడెన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మను ఓ పరాజితుడిగా అభివర్ణించాడు. తాజా ఐపీఎల్‌లో రోహిత్ శర్మ ఆటగాడిగా దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే.
ఈ సీజన్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న గుజరాత్ యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌పై మాజీలు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సీజన్‌లో మూడో సెంచరీ సాధించిన గిల్‌ను ఆకాశానికెత్తేస్తున్నారు. శుక్రవారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో గిల్ బౌండరీల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్ ప్రస్థానం ముగిసింది. శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో 62 పరుగుల తేడాతో ఓటమి పాలైన ముంబై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి గుజరాత్‌కు బ్యాటింగ్ అప్పగించిన రోహిత్ శర్మ భారీ మూల్యం చెల్లించాడు.
గుజరాత్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తన అద్భుత ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్‌లో మూడో సెంచరీ సాధించాడు. శుక్రవారం సాయంత్రం గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే.
ఈ ఐపీఎల్ ద్వారా ముంబై ఇండియన్స్ జట్టుకు దొరికిన మరో బ్యాటింగ్ సంచలనం తిలక్ వర్మ. ఈ కుర్రాడు ఈ సీజన్ ఆద్యంతం చక్కగా రాణించాడు. ఏ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అంచనాల మేరకు సత్తా చాటాడు. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో తిలక్ వర్మ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు
టీమిండియాను అంతర్జాతీయ స్థాయిలో బలమైన ప్రత్యర్థిగా నిలబెట్టిన ఘనత కచ్చితంగా మహేంద్ర సింగ్ ధోనీదే. ధోనీ తన కెరీర్లో బ్యాట్స్‌మెన్‌గా విఫలమై ఉంటాడు తప్ప.. నాయకుడిగా ఎప్పుడూ ఫెయిల్ కాలేదు.