Home » TATA IPL2023
సూర్య కుమార్ యాదవ్.. మైదానంలో నిప్పులు విరజిమ్ముతున్నాడు. పట్టపగలే బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. లీగ్ తొలి ఐదు మ్యాచ్‌ల్లోనూ మబ్బుల చాటున దాగిన సూర్య.. కీలక దశలో ప్రతాపం చూపిస్తున్నాడు.
ఐపీఎల్ అత్యంత కీలక దశకు చేరుకుంది. మరో రెండు వారాల్లో విజేత ఎవరో తేలనుంది. ఈ నేపథ్యంలో అన్ని జట్లూ సర్వశక్తులూ కేంద్రీకరించి పోరాడుతున్నాయి. శుక్రవారం రాత్రి ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడ్డాయి.
ఒక్క వికెట్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తుంది.. ఒక్క క్యాచ్ మ్యాచ్‌ను మలుపుతిప్పుతుంది.. ముఖ్యంగా పొట్టి క్రికెట్‌లో అయితే ఫీల్డింగ్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. టీ-20 క్రికెట్‌లో ఆటగాళ్లు అద్భుత ఫీల్డింగ్‌తో ఆకట్టుకుంటారు.
మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 149 పరుగులు మాత్రమే చేసింది. కోల్‌కతా బ్యాటర్లు ఆడిన తీరు చూస్తే ఆ పిచ్‌పై బ్యాటింగ్ కష్టం అనిపించింది. 149 పరుగులు ఛేజింగ్ చేయడం రాజస్థాన్‌కు కూడా కష్టమే అనిపించింది
అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన ఎమ్ఎస్ ధోనీ కొద్ది రోజులుగా మోకాలి గాయంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. మోకాలి గాయంతోనే ధోనీ ఈ ఐపీఎల్ ఆడుతున్నాడు. తాను స్వయంగా రాణిస్తూ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కు విజయాలు అందిస్తున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా ఎంతో మంది యువ ఆటగాళ్ల ప్రతిభ వెలుగులోకి వస్తోంది. ఈ ఐపీఎల్ ద్వారా ఇండియన్ క్రికెట్‌కు దొరికిన ఆణిముత్యం యశస్వి జైస్వాల్. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న జైస్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)లో లీగ్ మ్యాచ్‌లు దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయి. ప్రస్తుతానికి డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans)
ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవలి కాలంలో మైదానంలో భావోద్వేగాలను ప్రదర్శిస్తున్నాడు. ముఖ్యంగా ఫీల్డింగ్‌లో ఆటగాళ్లు తప్పు చేసినపుడు రోహిత్ కాస్త అసహనానికి గురవుతున్నాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ బ్యాటింగ్ ప్రదర్శన ఐపీఎల్‌లోనూ కొనసాగుతోంది. ఐపీఎల్‌లో ముంబై జట్టును నడిపిస్తున్న రోహిత్ జట్టుకు భారంగా మారుతున్నాడు. నాయకుడిగా సఫలమవుతున్నా, ఆటగాడిగా మాత్రం ఘోరంగా విఫలమవుతున్నాడు.
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ఆటగాడు నవీన్-ఉల్-హక్, మెంటార్ గౌతమ్ గంభీర్ దాడి కొనసాగుతూనే ఉంది. ఇటీవల లఖ్‌నవూ, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స మ్యాచ్ అనంతరం కోహ్లీతో నవీనుల్, గంభీర్ గొడవపడిన సంగతి తెలిసిందే.