Home » TDP
రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ నాణ్యమైన ఇళ్లు కట్టిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది.
YS Jagan: టీడీపీ సర్కారుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. డిస్కంలను నిలబెట్టడంలో విఫలమయ్యారని ఆయన మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల పాలనలో తిరుమలలో చాలా మార్పులు వచ్చాయని, పూర్వ వైభవం తీసుకువచ్చామని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. గతంలో భక్తులు అనేక ఇబ్బందులు పడే వారని.. ప్రస్తుతం సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా త్వరితగతిన స్వామి వారి దర్శనం కల్పిస్తున్నామని తెలిపారు.
కడప జిల్లా: తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి.. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గాల మధ్య చర్చలు కొలిక్కిరాలేదు. ఆర్టీపీపీ దగ్గర, అనంతపురం కడప జిల్లాల బోర్డర్ చెక్ పోస్టుల దగ్గర పోలీసు బలగాల పికేటింగ్ కొనసాగుతోంది. జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన లారీలు తాడిపత్రి నుండి వచ్చిఆర్టీపీపీ దగ్గర ఆగిపోయాయి. రెండు రోజుల క్రితం ప్లైయాష్ కోసం వచ్చి వాహనాలు ఆగిపోయాయి.
రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎ్‌సఎంఈ) సర్వే శుక్రవారం నుంచి ప్రారం భం కానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి ఒకటి వరకు ఈ సర్వే కొనసాగుతుంది.
యువతకు ఉద్యోగాల కల్పనే నైపుణ్య గణన లక్ష్యమని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ చెప్పారు. నిరుద్యోగ యువతకు ఈ నైపుణ్య గణన ఉపయోగపడాలని అధికారులకు సూచించారు.
తనపై కస్టోడియల్ టార్చర్‌కు పాల్పడిన సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్‌కుమార్ పారిపోయే అవకాశాలున్నాయని, ఆయనపై లుక్అవుట్ నోటీసులు జారీ చేయాలని శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు.
మాజీ ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు హత్యకు వైసీపీ హయాంలో సీఐడీ కుట్ర చేసిందని పోలీసులు వెల్లడించారు. కస్టడీలో ఆయనను చిత్రహింసలకు గురిచేశారని, తాళ్లతో కాళ్లు కట్టేసి.. రబ్బర్ బెల్టు, లాఠీలతో తీవ్రంగా కొట్టారని తెలిపారు. దీనిపై జూన్ 10న గుంటూరు నగరంపాలెం పోలీసు స్టేషన్లో రఘురామ చేసిన ఫిర్యాదు...
ఎవరు గంజాయి సాగు చేసినా... సరఫరా చేస్తూ పట్టుబడినా.. మత్తు పదార్థాలు విక్రయించినా కటకటాలు లెక్కపెట్టాల్సిందే. అంతేకాదు.. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటికీ దూరం కావాల్సిందే! ఆంధ్రప్రదేశ్‌లో గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైన కూటమి సర్కారు... దీనిపై బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తోంది.
టీడీపీ బలోపేతానికి అన్ని ఆర్గనైజేషన్లలో పార్టీ నాయకత్వాన్ని నియమిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అభివృద్ధికి నాంది పలుకుతున్నాం. సుపరిపాలనకు ప్రాధాన్యతనిస్తున్నామని చెప్పారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని తప్పులు చేసిన వారిని చట్టపరంగా శిక్షపడేలా చేస్తామని హెచ్చరించారు.