Share News

ఐదేళ్లలో పేదలందరికీ ఇళ్లు!

ABN , Publish Date - Nov 29 , 2024 | 03:52 AM

రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ నాణ్యమైన ఇళ్లు కట్టిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది.

ఐదేళ్లలో పేదలందరికీ ఇళ్లు!

  • ఎన్నికల హామీపై కూటమి సర్కారు కసరత్తు

  • రాష్ట్రంలో పీఎంఏవై 2.0 అమలుకు గ్రీన్‌సిగ్నల్‌

అమరావతి, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ నాణ్యమైన ఇళ్లు కట్టిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు పట్టణాల్లో 2సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు మంజూరు చేసేందుకు సర్వే ప్రారంభించింది. డిసెంబరు నాటికి రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఇళ్లను పూర్తి చేసి.. వాటిలో లబ్ధిదారులతో సామూహిక గృహ ప్రవేశాలు చేయించేందుకు హౌసింగ్‌ కార్పొరేషన్‌ అధికారులు నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేశారు. వచ్చే ఏడాదికల్లా మిగిలిన అసంపూర్తి ఇళ్ల నిర్మాణాన్ని కూడా పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో పీఎంఏవై 2.0 పథకం అమలుకు కేంద్ర హౌసింగ్‌ మంత్రిత్వ శాఖతో ఎంవోయూ చేసుకునేందుకు గృహ నిర్మాణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి అధికారం ఇస్తూ తాజాగా ఉత్తర్వులు విడుదల చేసింది. దాంతో వీలైనంత త్వరలోనే ఈ ఎంవోయూ చేసుకునేందుకు రాష్ట్ర హౌసింగ్‌ అధికారులు సన్నద్ధమవుతున్నారు. 2029 నాటికి రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇళ్లు నిర్మించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

Updated Date - Nov 29 , 2024 | 03:53 AM