Share News

Kadapa: జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మధ్య కొలిక్కిరాని చర్చలు

ABN , Publish Date - Nov 28 , 2024 | 12:21 PM

కడప జిల్లా: తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి.. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గాల మధ్య చర్చలు కొలిక్కిరాలేదు. ఆర్టీపీపీ దగ్గర, అనంతపురం కడప జిల్లాల బోర్డర్ చెక్ పోస్టుల దగ్గర పోలీసు బలగాల పికేటింగ్ కొనసాగుతోంది. జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన లారీలు తాడిపత్రి నుండి వచ్చిఆర్టీపీపీ దగ్గర ఆగిపోయాయి. రెండు రోజుల క్రితం ప్లైయాష్ కోసం వచ్చి వాహనాలు ఆగిపోయాయి.

Kadapa: జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి  మధ్య కొలిక్కిరాని చర్చలు

కడప జిల్లా: తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy).. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి (MLA Adinarayana Reddy) వర్గాల మధ్య చర్చలు కొలిక్కిరాలేదు. ఆర్టీపీపీ (RTPP) ప్లైయాష్ (Playash) రవాణా రచ్చకు సంబంధించి కూటమి నేతలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) సీరియస్ అయ్యారు. దీంతో మరోసారి ఇరువర్గాల నేతలు చర్చించుకుంటున్నారు. ఆర్టీపీపీ దగ్గర, అనంతపురం కడప జిల్లాల బోర్డర్ చెక్ పోస్టుల దగ్గర పోలీసు బలగాల పికేటింగ్ కొనసాగుతోంది. జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన లారీలు తాడిపత్రి నుండి వచ్చిఆర్టీపీపీ దగ్గర ఆగిపోయాయి. రెండు రోజుల క్రితం ప్లైయాష్ కోసం వచ్చి వాహనాలు ఆగిపోయాయి. జేసీ వాహనాలను ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అడ్డుకోవడంతో ఆర్టీపీపీ దగ్గర లారీలు నిలిచి పోయాయి. కాగా ప్లైయాష్ లోడు లేకుండా వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి డ్రైవర్లు అంటున్నారు.


కొనసాగుతున్న ఉద్రిక్తత..

కడప జిల్లా: జమ్మలమడుగులో నియోజక వర్గ పరిధిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆర్టీపీపీ నుంచి ఫ్లైయాస్ పౌడర్ (Flyash powder) తాడిపత్రికి (Tadipatri) తరలించే విషయంలో జేసీ బ్రదర్స్ (JC Bros.,).. (vs) ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి (MLA Adinayana Reddy) వర్గాల మధ్య వివాదం నడుస్తోంది. రెండు రోజులుగా ఇరు వర్గల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. అటు తాడిపత్రి నుంచి జేసీ వర్గీయులు మళ్లీ వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్తగా పోలీసు బలగాలు మొహరించాయి. అనంత పురం, కడప జిల్లా బోర్డర్ అయిన కొండాపురం మండలంలో చెక్ ఫోస్ట్ ఏర్పాటు చేశారు. ఆర్టీపీపీ నుండి ప్లయాస్ పౌడర్‌ను తాడిపత్రికి తరలించే విషయంలో జేసీ బ్రదర్స్ ఆదినారాయణ వర్గాల మధ్య వివాదం నడుస్తోంది.

కాగా జేసీ దివాక‌ర్‌రెడ్డి, ఆదినారాయ‌ణ‌రెడ్డి.. ఇద్దరూ కూట‌మి నేతలే కావ‌డం విశేషం. జేసీ దివాక‌ర్‌రెడ్డి తాడిప‌త్రికి చెందిన టీడీపీ నాయ‌కుడు, ఆదినారాయ‌ణ‌రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే. వీళ్లిద్దరి మ‌ధ్య ప్లైయాష్ త‌ర‌లింపున‌కు సంబంధించిన ఒప్పందంపై విభేదాలు తలెత్తాయి. జ‌మ్మల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోకి ఆర్టీపీపీ వ‌స్తుంది. దీంతో త‌మ నియోజ‌క‌వ‌ర్గంలో ఏం జ‌రిగినా త‌మ క‌నుస‌న్నల్లోనే జరగాలని ఆదినారాయ‌ణ‌రెడ్డి భావిస్తున్నారు. అయితే తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గంలోని సిమెంట్ ప‌రిశ్రమ‌ల‌కు ఆర్టీపీపీ నుంచి జేసీ దివాక‌ర్‌రెడ్డి వ‌ర్గీయుల వాహ‌నాలు ప్లైయాష్ త‌ర‌లిస్తున్నాయి. దీనిపై ఒప్పందం కుద‌ర‌క‌పోవ‌డంతో జేసీ దివాక‌ర్‌రెడ్డి వాహ‌నాల్ని ఆర్టీపీపీకి ఎట్టి ప‌రిస్థితుల్లో రానివ్వకూడ‌ద‌ని ఆదినారాయ‌ణ‌రెడ్డి వ‌ర్గీయులు పంతం ప‌ట్టారు.

ఈ నేపథ్యంలో బుధవారం జేసీ దివాక‌ర్‌రెడ్డి వాహ‌నాలు ఆర్టీపీపీకి వ‌స్తున్నాయ‌ని తెలిసి, ఆర్టీపీపీ స‌మీపంలోని క‌ల‌మ‌ల్ల వ‌ద్ద ఆదినారాయణ‌రెడ్డి వ‌ర్గీయులు భారీగా మోహ‌రించారు. వ‌స్తే అడ్డుకోడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విష‌యం తెలిసిన పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండ బందోబస్తు ఏర్పాటు చేశారు.

బూడిద తమ దగ్గర ఉంది కాబట్టి తమ వాహనాలతో తరలిస్తామని ఆదినారాయణరెడ్డి వర్గీయులు అంటున్నారు. కానీ తరలించేది తాడిపత్రికి కాబట్టి తమ వాహనాల్లోనే తీసుకువస్తామని జేసీ ప్రభాకర్ రెడ్డి అంటున్నారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య పంచాయతీ పెరిగిపోయింది. దీంతో జేసీ వాహనాలు వస్తే అడ్డుకుని తీరుమామని ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇంకా అజ్ఞానంలోనే రాంగోపాల్ వర్మ..

పిఠాపురానికి చెందిన మరో కార్మికుడు మృతి

ఒక రోజు ముందుగానే సామాజిక పింఛన్ల పంపిణీ

దేనికి విజయోత్సవాలు.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్...

జీజీహెచ్‌లో వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 28 , 2024 | 12:53 PM