Home » Telangana Administration Day
ఫార్ములా ఈ కార్ రేస్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించింది. ఈ కార్ రేసులో చోటుచేసుకున్న అవినీతిపై రేవంత్ ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు రేవంత్ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. అయితే ఈ కేసుపై తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు.
రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించి 317 జీవో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. భార్యాభర్తలు (స్పౌజ్), మెడికల్ గ్రౌండు, పరస్పర (మ్యుచువల్) బదిలీలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని ఆయా శాఖలను ప్రభుత్వం ఆదేశించింది.
భద్రకాళి అమ్మవారిని ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మాడ వీధులను త్వరితగతిన పూర్తి చేస్తామని మాటిచ్చారు. భద్రకాళి జలాశయాన్ని తాగునీటి జలయశంగా మారుస్తామని హామీ ఇచ్చారు. భద్రకాళి చెరువు కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మహానగరం చుట్టూ డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసీ(GHMC) కసరత్తు చేస్తోంది. జవహర్‌నగర్ డంపింగ్ యార్డుపై వ్యర్థాల భారం తగ్గించేలా ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించారు. ఆ భూములను బల్దియాకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి, సంగారెడ్డి కలెక్టర్లకు కమిషనర్ ఆమ్రపాలి(Commissioner Amrapali) లేఖ రాశారు.