Share News

KTR: కేటీఆర్‌ ఎపిసోడ్‌: రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ

ABN , Publish Date - Dec 20 , 2024 | 10:11 AM

ఫార్ములా ఈ కార్ రేస్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించింది. ఈ కార్ రేసులో చోటుచేసుకున్న అవినీతిపై రేవంత్ ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు రేవంత్ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. అయితే ఈ కేసుపై తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు.

KTR: కేటీఆర్‌ ఎపిసోడ్‌: రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ

హైదరాబాద్: ఫార్ములా ఈ కార్ రేస్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించింది. ఈ కార్ రేసులో చోటుచేసుకున్న అవినీతిపై రేవంత్ ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఈ కార్ రేసులో భారీగా అవినీతి జరిగిందని రేవంత్ సర్కార్ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు నోటీసులు కూడా ఇచ్చింది. ఈ రోజు లేదా రేపు కేటీఆర్ అరెస్ట్ అవుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈరోజు శుక్రవారమే అరెస్ట్ చేస్తారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.


కేటీఆర్‌పై నమోదైన కేసుపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా ఇవాళ్టితో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగిసే అవకాశం ఉంది. అయితే ఫార్ములా ఈ రేస్‌పై ఇప్పటికే కేటీఆర్ స్పష్టత ఇచ్చారు. అసెంబ్లీలో చర్చ చేపడితే సమాధానం ఇస్తానని కేటీఆర్ స్పష్టం చేశారు. ఫార్ములా ఈ రేస్ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఫార్ములా ఈ రేస్ కో ఫౌండర్ ఆల్బర్ట్ హైదరాబాద్ వచ్చి రేవంత్ రెడ్డిని కలిశారని కేటీఆర్ అన్నారు.ఈ రేసుకు సంబంధించిన వాస్తవాలను సీఎం రేవంత్ దాస్తున్నారని కేటీఆర్ చెప్పారు. ఫార్ములా ఈ రేస్‌లో ఎలాంటి అవినీతి జరగలేదని కేటీఆర్ తేల్చిచెప్పారు.


కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారు: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

Madhavaram-Krishna-Rao.jpg

కేటీఆర్‌పై రేవంత్ అక్రమ కేసులపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించారు. ప్రపంచపటంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపెట్టినందుకా కేటీఆర్‌పై కేసులు పెట్టడమని ప్రశ్నించారు. ఏం తప్పు చేశారని ఏసీబీ విచారణ చేస్తుందని నిలదీశారు. ఈ రోజు తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.


ఈ ఫార్ములా రేస్ ద్వారా తెలంగాణకు రూ. 700 కోట్లపై చిలుకు ఆదాయం వచ్చిందని గుర్తుచేశారు. ఈ ఫార్ములా రేస్ ద్వారా ప్రపంచంలో తెలంగాణ రాష్ట్రానికి గుర్తింపు వచ్చిందని తెలిపారు. కక్ష్యపూరిత కేసులు రేవంత్ ప్రభుత్వం పెడుతుందని ధ్వజమెత్తారు. రేవంత్ ఇదే ధోరణి అవలంబిస్తే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి

Lagacharla Case: సంగారెడ్డి సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్న లగచర్ల రైతులు

TG NEWS: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పదిమందికి తీవ్ర గాయాలు

NTR Statue: ఓఆర్‌ఆర్‌ వద్ద వంద అడుగుల ఎన్టీఆర్‌ విగ్రహం

Read Latest Telangana News and Telugu News

Updated Date - Dec 20 , 2024 | 11:29 AM