Waterboard: ట్యాంకర్లను పక్కదారి పట్టిస్తే క్రిమినల్ కేసులు..
ABN , Publish Date - Feb 04 , 2025 | 07:42 AM
ట్యాంకర్లను పక్కదారి పట్టిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వాటర్‌బోర్డు అధికారులు(Waterboard officials) హెచ్చరిస్తున్నారు. వారి నల్లా కనెక్షన్ నంబర్‌పై మాత్రమే బుక్ చేసుకోవాలని.. ఒకరి కనెక్షన్ నంబర్(Connection number)ను మరొకరు వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

- వాటర్‌బోర్డు అధికారులు
హైదరాబాద్ సిటీ: ట్యాంకర్లను పక్కదారి పట్టిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వాటర్‌బోర్డు అధికారులు(Waterboard officials) హెచ్చరిస్తున్నారు. వారి నల్లా కనెక్షన్ నంబర్‌పై మాత్రమే బుక్ చేసుకోవాలని.. ఒకరి కనెక్షన్ నంబర్(Connection number)ను మరొకరు వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తాజాగా మాదాపూర్(Madhapur)లో ఓ గృహానికి గల నల్లా కనెక్షన్ నంబర్ ద్వారా ప్రతిరోజు ట్యాంకర్లను బుక్ చేస్తున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Mayor: అదుపు తప్పి పడిపోయిన మేయర్
తమకు తెలియకుండా ఎవరో బుక్ చేస్తున్నారని, వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలంటూ ఇంటి యజమాని వాటర్‌బోర్డు అధికారులను కోరారు. దీనిపై విచారించగా మాదాపూర్‌లోని ఓ నీటి ట్యాంకర్ యజమాని ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా వాటర్‌బోర్డు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఇతరుల నల్లా కనెక్షన్ నంబర్‌పై ట్యాంకర్‌ను బుకింగ్ చేసి వాణిజ్య అవసరాలకు విక్రయిస్తున్నట్లు తేల్చారు. దాంతో సంబంధిత ట్యాంకర్‌ను బ్లాక్ లిస్టులో చేర్చారు. అతడిపై కేసు నమోదు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.
ఈవార్తను కూడా చదవండి: KP Chowdary : నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య
ఈవార్తను కూడా చదవండి: MLA Raj Gopal Reddy : మంత్రిని అడ్డుకున్నారన్న కేసు కొట్టివేయండి
ఈవార్తను కూడా చదవండి: Leopard: గ్రామ సింహం దెబ్బకు పరుగులు పెట్టిన చిరుత..
ఈవార్తను కూడా చదవండి: కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారు: ఎంపీ ధర్మపురి ఆగ్రహం..
Read Latest Telangana News and National News