Home » Telangana Agitation
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని ప్రైవేట్ ఉపాధ్యాయుల గురించి తక్కువ చేసి మాట్లాడటం తగదని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. సిద్దిపేటలోని పోలీస్ కన్వేషన్ హల్లో జిల్లా ట్రస్మా ఆధ్వర్యంలో ఈరోజు (శనివారం) గురుపూజోత్సవం, ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార మహోత్సవం జరిగింది.
సాగర్ ఎడమకాల్వ ఎంబీ కెనాల్ (ముక్త్యాల బ్రాంచ్ కెనాల్) ఆయకట్టు రైతుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఈ కెనాల్‌కు మూడు చోట్ల గండ్లు పడగా, నేటికీ మరమ్మతు పనులు ప్రారంభం కాలేదు. దీంతో 1.25లక్షల ఎకరాల ఆయకట్టు పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.
ఉచెన్నా.. ఎజియోనిలి ఫ్రాంక్లిన్ ఉచెన్నా అలియాస్ కలేషీ..! ఎనిమిదేళ్లుగా హైదరాబాద్ నగరంలోనే తిష్ట వేశాడు. నైజీరియా నుంచి డ్రగ్స్ తెప్పించి.. నగరంలో విక్రయించాడు.
తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ఊరట లభించింది. 2011లో తనపై నమోదైన రైలు రోకో కేసును కొట్టివేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్ సోమవారం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఆ క్రమంలో ఈ కేసు విచారణపై హైకోర్టు మంగళవారం స్టే విధించింది. అలాగే ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని 2004లోనే చెప్పానని గుర్తు చేశారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సోనియా పాల్గొంటారనుకున్నప్పటికీ.. అనివార్య కారణాలతో ఆమె పర్యటన రద్దు కావడంతో ఢిల్లీ నుంచి వీడియో ద్వారా సందేశాన్నిచ్చారు.
రాష్ట్ర దశాబ్ది వేడుకల సందర్భంగా ఓ వైపు పరేడ్ గ్రౌండ్‌లో కాంగ్రెస్ సభ ఏర్పాటు చేస్తుండగా.. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్(BRS) సైతం రాష్ట్ర వ్యాప్తంగా గ్రాండ్‌గా దశాబ్ది వేడుకలను జరపాలని నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేసీఆర్(KCR) పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
రేవంత్ రెడ్డి సర్కార్.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహలు చేస్తుంది. ఈ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఢిల్లీ వెళ్లనున్నారనే ఓ చర్చ అయితే రాజకీయ వర్గాల్లో వైరల్ అవుతుంది.
జూన్ 2వ తేదీ. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. ఈ ఆవిర్బావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సమాయత్తమైంది. అందులోభాగంగా ఆ రోజు పలు కీలక నిర్ణయాలను ఈ సర్కార్ ప్రకటించనుందని తెలుస్తుంది.
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటనపై నేడు సీబీఐ కోర్టులో తీర్పు వెలువడనుంది. యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీబీఐ కోర్ట్‌లో సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇప్పటికే జగన్ విదేశీ పర్యటనకు వ్యతిరేకంగా సీబీఐ కౌంటర్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు యూకే వెళ్ళేందుకు అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు.
కుమారుడిని చూడకుండా ఓ తల్లి ఎన్ని రోజులని ఉండగలదు? ఆ తల్లి ఏకంగా మూడున్నరేళ్లు కొడుకును కనీసం చూడలేదు. భర్తతో గొడవపడి, కుమారుడిని కట్టుకున్నోడి వద్దే వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమె అడిగినప్పుడల్లా... ‘కొడుకు బాగున్నాడు’ అని చెబుతూ వచ్చాడా భర్త!! విషయం ఏమిటంటే.. ఓ నాటు వైద్యుడి మందుల కారణంగా ఆ బాలుడు ఈ లోకాన్ని వీడి మూడేళ్లు దాటిపోయింది. ఈ ఘోరం కన్నతండ్రిగా తనకు తెలిసినా కూడా అతడు భార్యకు చెప్పలేదు. పైగా...