Share News

Telangana: ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు కేసీఆర్ వస్తారా?

ABN , Publish Date - May 25 , 2024 | 04:44 PM

రేవంత్ రెడ్డి సర్కార్.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహలు చేస్తుంది. ఈ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఢిల్లీ వెళ్లనున్నారనే ఓ చర్చ అయితే రాజకీయ వర్గాల్లో వైరల్ అవుతుంది.

Telangana: ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు కేసీఆర్ వస్తారా?

రేవంత్ రెడ్డి సర్కార్.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహలు చేస్తుంది. ఈ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఢిల్లీ వెళ్లనున్నారనే ఓ చర్చ అయితే రాజకీయ వర్గాల్లో వైరల్ అవుతుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ద్వారా ఆ ప్రాంత ప్రజలు కన్న కలలను సోనియాగాంధీ సాకారం చేసిందని గతంలోనే ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో ఈ వేడుకల వేళ.. సోనియాగాంధీని ఘనంగా సన్మానించాలని ఆ పార్టీ నేతలంతా నిర్ణయించారని సదరు వర్గాల్లో ఓ చర్చ నడుస్తుంది. తెలంగాణ తల్లిగా సోనియాగాంధీని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికే అభివర్ణించారు. అదీకాక రాష్ట్రం ఏర్పాడి దశాబ్దం పూర్తి చేసుకుంటుంది. దీంతో ఈ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది.

LokSabha Elections: ఈవీఎంలకు బీజేపీ ట్యాగ్.. స్పందించిన ఈసీ


ఈ వేడుకలకు ఉద్యమకారుల కుటుంబాలను సైతం ఆహ్వానిస్తుంది. వారిని సైతం సన్మానించేందుకు ఈ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆ క్రమంలో ఈ వేడుకలకు బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి సర్కార్ ఆహ్వానిస్తుందా? ఓ వేళ ఆహ్వానించినా.. రేవంత్ సర్కార్ సోనియాగాంధీ, ఉద్యమకారుల కుటుంబాలతోపాటు కేసీఆర్‌ను సైతం సన్మానిస్తుందా? అనే ఓ చర్చ సైతం రాజకీయ వర్గాల్లో హల్‌చల్ చేస్తుంది.

ఇక 2014లో తెలంగాణ రాష్ట్ర కల సాకారం కాగానే.. కేసీఆర్ ఫ్యామిలీలోని ఒకరు ఇద్దరు కాదు.. ఏకంగా 13 మంది న్యూఢిల్లీ వెళ్లి నాటి యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఫొటో దిగి వచ్చారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా.. ప్రాణాలకు తెగించి తాను కొట్లాడి మరీ తెచ్చానంటూ టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్.. తన ఎన్నికల ప్రచారంలో స్వయంగా ప్రకటించుకున్నారు.

LokSabha Elections: ఓటేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..


అలా 2014, 2019 ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ వరుసగా తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకుంది. ఇక 2023 ఎన్నికల్లో తెలంగాణ ఓటరు.. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు. దీంతో రేవంత్ రెడ్డి సర్కార్ కొలువు తీరింది. మరి రేవంత్ సర్కార్ నిర్వహిస్తున్న ఈ దశాబ్ది వేడుకలకు కేసీఆర్‌ను ఆహ్వానిస్తారా? ఓ వేళ ఆహ్వానం అందినా కేసీఆర్ ఈ వేడుకలకు హాజరవుతారా? కేసీఆర్ ఈ వేడుకలకు వస్తే.. సభ వేదిక మీద ఆయన ఆసీనులవుతారా? లేకుంటే ఆహ్వానితుల్లో ఒకరుగా ఆయన కూర్చుంటారా? అనే సందేహం సైతం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది.

ఇక అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇంకోవైపు కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. దీంతో కేసీఆర్ అండ్ కో దాదాపుగా సైలెన్స్‌ మెయింటేన్ చేస్తుంది. ఆ క్రమంలో లోక్‌సభ ఎన్నిక వేళ.. బీఆర్ఎస్ పార్టీ నేతలు సైతం ప్రచారానికి దాదాపుగా దూరంగా ఉన్నారనే ఓ ప్రచారం సైతం సాగుతుంది. అలాంటి వేళ.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు కేసీఆర్ హాజరవుతారా? అనే సందేహాలు సైతం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది.

Read Latest Telangana News and Telugu News

Updated Date - May 25 , 2024 | 04:44 PM