Share News

Rail Roko: హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్‌కు ఊరట

ABN , Publish Date - Jun 25 , 2024 | 01:15 PM

తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ఊరట లభించింది. 2011లో తనపై నమోదైన రైలు రోకో కేసును కొట్టివేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్ సోమవారం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఆ క్రమంలో ఈ కేసు విచారణపై హైకోర్టు మంగళవారం స్టే విధించింది. అలాగే ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

Rail Roko: హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్‌కు ఊరట
BRS Chief KCR

హైదరాబాద్, జూన్ 25: తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ఊరట లభించింది. 2011లో తనపై నమోదైన రైలు రోకో కేసును కొట్టివేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్ సోమవారం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఆ క్రమంలో ఈ కేసు విచారణపై హైకోర్టు మంగళవారం స్టే విధించింది. అలాగే ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణను జులై 18వ తేదీకి వాయిదా వేసింది.


తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగంగా 2011, అక్టోబర్‌లో నాటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. రైలు రోకోకను పిలుపునిచ్చారంటూ మల్కాజ్‌గిరి పోలీసులు కోర్టుకు నివేదిక సమర్పించారు. అలాగే పలు రైళ్ల రాకపోకలకు, రైల్వే ఉద్యోగుల విధులకు ఆయన ఆటంకం కలిగించినట్లు ఆ నివేదికలో స్పష్టం చేశారు. దీనిపై మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. తాను ఎలాంటి రైలు రోకోను పిలుపు ఇవ్వలేదన్నారు. ఎవరో ఇచ్చిన వాంగ్మూలం మేరకు తనపై పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పారు.


ఇక ఈ రైలు రోకో ఘటన చోటుచేసుకున్న మూడేళ్లకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఎలాంటి బలం ఉండని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. అందులోభాగంగా తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో కేసీఆర్ తన వాదనను స్పష్టం చేశారు. దాంతో మంగళవారం వాదనలు విన్న హైకోర్టు.. ఈ కేసును జులై 18వ తేదీకి వాయిదా వేసింది.

For Latest News and National News click here

Updated Date - Jun 25 , 2024 | 01:46 PM