Harish Rao: ప్రైవేట్ ఉపాధ్యాయులపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు..తీవ్రంగా ఖండించిన హరీష్‌రావు
ABN , Publish Date - Sep 14 , 2024 | 02:53 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని ప్రైవేట్ ఉపాధ్యాయుల గురించి తక్కువ చేసి మాట్లాడటం తగదని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. సిద్దిపేటలోని పోలీస్ కన్వేషన్ హల్లో జిల్లా ట్రస్మా ఆధ్వర్యంలో ఈరోజు (శనివారం) గురుపూజోత్సవం, ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార మహోత్సవం జరిగింది.
సిద్దిపేట జిల్లా: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) రాష్ట్రంలోని ప్రైవేట్ ఉపాధ్యాయుల గురించి తక్కువ చేసి మాట్లాడటం తగదని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు (Harish Rao) అన్నారు. సిద్దిపేటలోని పోలీస్ కన్వేషన్ హల్లో తెలంగాణ రికగ్నైస్డ్ స్కూల్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ జిల్లా (ట్రాస్మా) ఆధ్వర్యంలో ఈరోజు (శనివారం) గురుపూజోత్సవం, ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార మహోత్సవం జరిగింది. ఉపాధ్యాయులు అందరికీ గురుపూజోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి హరీష్‌రావు, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ... గురుపూజోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు మాత్రమే రేవంత్ ప్రభుత్వం సన్మానం చేసిందని, గురువులంతా సమానమేనని.. ప్రైవేట్ ఉపాధ్యాయులను కూడా సన్మానించాలని హరీష్‌రావు కోరారు. పదోతరగతి ఫలితాలు వస్తే సిద్దిపేట రాష్ట్రంలోనే మొదటి రెండో స్థానంలో ఉంటుందని హరీష్‌రావు చెప్పారు. మంచి ర్యాంక్‌లు సాధించి ఉపాధ్యాయులు సిద్దిపేట ప్రతిష్ఠ పెంచారని ప్రశంసించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయులను వేరు చేసి మాట్లాడుతున్నారని.. అలా చేయడం సరికాదని హరీష్‌రావు అన్నారు.
ALSO READ: Minister: రెచ్చగొట్టే వారిని అణిచివేయండి..
ప్రైవేట్ ఉపాధ్యాయులకు జీతంలో వ్యత్యాసం ఉంది.. కానీ సామర్థ్యంలో కాదని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రైవేట్ ఉపాధ్యాయుల గురించి తక్కువ చేసి మాట్లాడటం తగదని అన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లోనే ఎక్కువ మంది విద్యార్థులు చదువుతున్నారని చెప్పారు. పిల్లలను పై తరగతుల వరకు చదివించమటమే తరగని ఆస్తి అని తల్లిదండ్రుల్లో మార్పు వచ్చిందని తెలిపారు. ప్రభుత్వాలు చేయాల్సిన పనిని ప్రైవేట్ వ్యవస్థలు చేస్తున్నాయని గుర్తుచేశారు. అమెరికాలో చదువుకున్న తెలుగు ప్రజలు ఎక్కువ మంది ఉన్నారని హరీష్‌రావు తెలిపారు.
ALSO READ: Holiday: గుడ్ న్యూస్.. ఆ రోజున సెలవు ప్రకటించిన సర్కార్..
నియోజకవర్గం పునర్ విభజనలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని అన్నారు. బెస్ట్ అవెలబుల్ స్కూల్స్‌కి ప్రభుత్వం పది నెలలు ఆయిన ఒక్క రూపాయి కూడా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని విమర్శించారు. జిల్లాలోని ప్రైవేట్ ఉపాధ్యాయులకు తన సొంత డబ్బులతో రూ. 5లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నానని హరీష్‌రావు వివరించారు.
ఉపాధ్యాయులు పిల్లల్లో ప్రజెంటేషన్ స్కిల్స్ పెంచాలని కోరారు. కుటుంబ బంధాలు బలపరిచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని హరీష్‌రావు కోరారు. ఉపాధ్యాయులు వ్యక్తులు కాదు.. భావిపౌరులను తయారు చేసే శక్తులు అని హరీష్‌రావు కొనియాడారు.
ఈ వార్తలు కూడా చదవండి
Telangana: రెచ్చిపోయిన కేటీఆర్.. సీఎం రేవంత్‌పై తీవ్ర వ్యాఖ్యలు..
Hyderabad: వామ్మో జ్వరం.. పెరుగుతున్న వైరల్ ఫీవర్ల బాధితులు
Telangana: ఎమ్మెల్యే గాంధీపై అటెంప్ట్ టు మర్డర్ కేసు..