Home » Telangana Assembly
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతాయి. సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఎన్నిక విషయాన్ని ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ తెలపనున్నారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక కోసం బుధవారం నామినేషన్ల స్వీకరణ జరగనుంది. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లకు గడువు విధించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ వేయనున్నారు.
మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. కౌలు రైతులను ఎలా గుర్తిస్తారో.. పైసలు ఎట్లా వేస్తారో చూద్దామనుకుంటే 6 నెలలు తప్పించుకున్నారుగా? అంటూ ‘ఎక్స్’ వేదికగా ఎద్దేవా చేశారు. 22 లక్షల మంది కౌలు రైతులకు పెట్టుబడి లేనట్టేనా యాసంగికి అని విమర్శలు గుప్పిస్తున్నారు
Telangana: ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఓవైసీ నియామకాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. శనివారం అసెంబ్లీలోని గాంధీ విగ్రహం వద్ద బైఠాయించేందుకు వచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు.
Telangana: కొత్తగా పదవీ బాధ్యతలు ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యేలకు మాజీ మంత్రి హరీష్రావు శుభాకాంక్షలు తెలియజేశారు. శనివారం మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ... ప్రభుత్వం నుంచి కొంత స్పష్టత కావాలని.. విమర్శలు చేయడానికి తాము రాలేదన్నారు.
Telangana: గవర్నర్ సెక్రటరీ సురేంద్ర మోహన్తో బీజేపీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో శనివారం రాజ్భవన్లో గవర్నర్ సెక్రెటరీని ఎమ్మెల్యేలు కలిశారు.
Telangana: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే నూతన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం చేపట్టారు. నూతన ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు.
Telangana: తొలిరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశం ముగిసింది. శనివారం ఉదయం సభ మొదలవగా నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు.
Telangana: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరికాసేపట్లో సమావేశంకానున్నాయి. నూతన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా అసెంబ్లీకి చేరుకుంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీకీ కొత్తగా ఎన్నికైన రామగుండం ఎమ్మెల్యే మాక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ న్యూ లుక్లో అసెంబ్లీకి వచ్చారు.
Telangana: తెలంగాణ అసెంబ్లీ ప్రోటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం ఉదయం రాజ్భవన్లో అక్బురుద్దీన్తో గవర్నర్ తమిళసై సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు.