Home » Telangana Assembly
Telangana: పాతబస్తీ మెట్రో నిర్మాణాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పాత బస్తీలో మెట్రో నిర్మాణంపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై సీఎం మాట్లాడుతూ...పాతబస్తీ అంటే ఓల్డ్ సిటీ కాదని.. అది ఒరిజినల్ సిటీ అని పేర్కొన్నారు. జైపాల్ రెడ్డి కేంద్ర అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా వయబుల్ గ్యాప్ ఫండ్ తీసుకువచ్చి హైదరాబాద్ మెట్రో నిర్మాణానికి కృషి చేశారని తెలిపారు.
Telangana: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా నడుస్తున్నాయి. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ మధ్య మాటల యుద్ధం నడిచింది. హరీష్‌రావు వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలని.. ప్రభుత్వం ప్రజల లక్ష్యంగా పని చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ఆరు గ్యారంటీలకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో కేటాయింపులు పెంచారు.. కానీ అసలు బడ్జెట్లో కేటాయింపులు తగ్గించారని విమర్శించారు.
Telangana Budget 2024: అసెంబ్లీలలో తెలంగాణ రసవత్తర చర్చ నడిచింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు మొదలు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలసీల్లో జరిగిన అవకతవకలపై చర్చ హాట్ హాట్‌గా జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఒకవైపు.. సీఎం, మంత్రులు ఒకవైపు సవాళ్లు, ప్రతిసవాళ్లు, వివరణలతో సభ దద్దరిల్లింది.
Telangana Assembly Budget Session 2024: తెలంగాణ అసెంబ్లీ రసవత్తరంగా సాగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడించింది. హాఫ్ నాలెడ్జ్‌తో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నాడని హరీష్ రావు అంటే.. రివర్స్ కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
మైనార్టీల సంక్షేమానికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఫహీముద్దీన్ ఖురేషి స్పష్టం చేశారు. మైనార్టీల సంక్షేమం కోసం బడ్జెట్లో తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Telangana Budget 2024-25: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీఆర్ఎస్ అధినేత, విపక్ష నేత కేసీఆర్ చేసిన కామెంట్స్‌కు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడిన మంత్రులు, ఎమ్మెల్యేలు..
అసెంబ్లీలో భజన బ్యాచ్ ఎక్కువైపోయిందన్నారు కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు బాధాకరంగా ఉందన్నారు.
Telangana Budget 2024-25: తెలంగాణ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క గురువారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తెలంగాణ పూర్తి స్థాయి బడ్జెట్ రూ. 2,91,191 కోట్లు. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా రాష్ట్ర తలసరి ఆదాయం,
Telangana Budget: మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ అసెంబ్లీకి చేరుకున్నారు. గురువారం ఉదయం అసెంబ్లీకి వచ్చిన ఆయనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పూలబొకే ఇచ్చి స్వాగతం పలికారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్ హాజరయ్యారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ గత ఎన్నికల్లో ఓటిమిని చవిచూసింది.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. విపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనల మధ్య రెండో రోజు సభ మొదలైంది. సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రోడ్డు, కరెంటు లేకుండా తండాలను గ్రామ పంచాయతీలుగా చేశారని బీఆర్ఎస్ను విమర్శించారు.