Home » Telangana Assembly
Telangana: అధికారంలో పర్మినెంట్‌గా ఉంటాం అనుకున్న బీఆర్ఎస్కు ప్రజలిచ్చిన షాక్‌కు మతిభ్రమించింది అని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు. గురువారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. అధికారం కోల్పోయినా బీఆర్ఎస్ నేతల తీర మారడం లేదన్నారు. పార్టీలు మారామని తమ బ్రదర్స్‌ను విమర్శిస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్ని పార్టీలు మారారో తెలియదా? అని ప్రశ్నించారు.
Andhrapradesh: విద్యుత్‌పై జ్యుడిషియల్ విచారణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. గురువారం అసెంబ్లీలో విద్యుత్ పరిస్థితిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శ్వేతపత్రం విడుదల చేశారు. దీనిపై సభలో లఘు చర్చ జరుగగా.. విద్యుత్‌పై మూడు అంశాలపై విచారణకు ప్రభుత్వం సిద్ధమైంది.
పేదవాళ్లు సృష్టిస్తున్న డబ్బులు కొంతమంది చేతుల్లోకి వెళ్తోందని.. పేదవారు పేదోళ్లుగానే ఉంటుంటే, కొంతమంది రాత్రికి రాత్రే కోటీశ్వరులు ఎలా అవుతున్నారని కూనంనేని సాంబశివరావు అసెంబ్లీలో ప్రశ్నించారు. ఈ అంశంలో...
తాము విడుదల చేసిన శ్వేతపత్రం ఎవరినో కించపరచడానికో, అవమానించడానికో కాదని.. ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే విడుదల చేశామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం తన పదేళ్ల పాలనలో...
Telangana: తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు మధ్య మాటల యుద్ధం నడిచింది. కాళేశ్వరంపై వెంటనే సెట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని.. నిప్పులో కాల్చితేనే బంగారం విలువ తెలుస్తుందని ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు.
Telangana: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే స్పీకర్ గడ్డం ప్రసాద్ సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టారు.
CM Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు వరి వేయవద్దని చెప్పి కేసీఆర్ మాత్రం తన ఫాంహౌస్‌లో 150 ఎకరాల్లో వరి పండించారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌కు ఓ న్యాయం.. రైతులకు ఓ న్యాయం ఉంటుందా అని నిలదీశారు .
KTR: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మాజీ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో సీఎం పీసీసీ చీఫ్‌గా మాట్లాడుతున్నారని.. ఇది గాంధీ భవన్ కాదనే విషయం ఆయన గుర్తుపెట్టుకోవాలని కేటీఆర్ సూచించారు. రేవంత్‌కు పంట బీమా, రైతు బీమాకు తెలియదని ఆరోపించారు. రేవంత్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయినందుకు సిగ్గుపడుతున్నామని కేటీఆర్ అన్నారు.
CM Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనగా.. సీఎం ప్రసంగానికి BRS ఎమ్మెల్యేలు అడ్డు తగిలారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు సముదాయించారు. ప్రగతి భవన్ ప్రజల కోసమే నిర్మించారని.. అది ఇప్పుడు జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Telangana: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి వర్సెస్ మంత్రులు అన్న విధంగా సాగాయి. కాంగ్రెస్ అలవిగాని హామీలను ఇచ్చిందని.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే బీజేపీ ఊరుకోదని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.