Telangana: బీఆర్ఎస్‌లో మరో వికెట్ డౌన్.. కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న ఎమ్మెల్యే..!
ABN , Publish Date - Mar 30 , 2024 | 01:10 PM
అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కారు పార్టీని వీడతారంటూ ప్రచారం జరగుుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. గ్రేటర్ పరిధిలో ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవడం ద్వారా రానున్న లోక్‌సభతో పాటు.. కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందచ్చనే అంచనాలో హస్తం పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది.
గులాబీ బాస్ కేసీఆర్‌కు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. గేట్లు ఓపెన్ చేశామని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్యల తర్వాత.. బీఆర్‌ఎస్ నేతలు హస్తం పార్టీలోకి క్యూ కడుతున్నారు. గత పదేళ్లుగా కేసీఆర్ (KCR) వెంట నడిచిన నాయకులు పార్టీని వీడి పక్క పార్టీల్లో చేరుతున్నారు. ఇప్పటికే కే కేశవరావు, కడియం శ్రీహరి వంటి వారు బీఆర్‌ఎస్‌కు గుడ్ బై చెప్పగా.. తాజాగా అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కారు పార్టీని వీడతారంటూ ప్రచారం జరగుుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కువమంది గెలిచారు. దీంతో గ్రేటర్ పరిధిలో ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవడం ద్వారా రానున్న లోక్‌సభతో పాటు.. కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందచ్చనే అంచనాలో హస్తం పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది.
Congress: కాంగ్రెస్‌లో చేరిన హైదరాబాద్ మేయర్.. సోదరుడు కూడా
కీసరలో సమావేశం..
కీసరలోని ఓ ఫామ్ హౌస్‌లో బీఆర్‌ఎస్ నియోజకవర్గం నేతలతో ఆయన రేపు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. తన భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో కాలేరు వెంకటేష్ టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. గత నాలుగు రోజులుగా కాలేరు వెంకటేష్ పార్ట కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అందుబాటులో లేకపోవడంతో ఇవాల్టి కేటీఆర్ అంబర్ పేట పర్యటన వాయిదా వేసుకున్నారు. రెండు, మూడు రోజుల్లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కారు దిగి కాంగ్రెస్‌లోకి వెళ్తారనే ప్రచారం జరుగుతోంది.
Telangana: బీఆర్ఎస్‌కు మరో షాక్.. నెగ్గిన అవిశ్వాసం..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..