Home » Telangana Bhavan
బీఆర్ఎస్ పార్టీ 24వ వార్షికోత్సవాన్ని పార్టీ శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో సాదాసీదాగా వేడుకలు నిర్వహించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) నేతలు, కార్యకర్తలకు ఇప్పటికే ఆదేశించారు.
Telangana: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవి చూసిన బీఆర్ఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు అభ్యర్థులు ప్రకటించేశారు కేసీఆర్ . నేటి నుంచి నామినేషన్ల పర్వం షురూ అవడంతో అభ్యర్థులకు బీఫారం ఇచ్చేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్కు చేరుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులు, ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్: తెలంగాణ భవన్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుక కార్యక్రమం ఘనంగా జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటిఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
Telangana: మహాత్మ జ్యోతిరావు పూలే ఎంచుకున్న మార్గం, ఆయన బోధనలు అందరికీ ఆచరణీయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం తెలంగాణ భవన్లో మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కేటీఆర్, మధుసుధనాచారి, బీఆర్ఎస్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొని పూలేకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సమాజంలోని అన్ని వర్గాలు జ్యోతిబాపూలే వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవాలన్నారు.
బీఆర్ఎస్ పార్టీ (అప్పట్లో టీఆర్ఎస్) స్థాపన మొదలు.. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ముందు వరకూ ఎదురనేదే లేకుండా పోయింది. ఎన్ని సార్లు పార్టీ పదవులకు రిజైన్ చేసినా కూడా తిరిగి బంపర్ మెజారిటీతో బీఆర్ఎస్ నేతలు గెలిచారు. కానీ గత ఎన్నికల్లో మాత్రం 39 సీట్లకే బీఆర్ఎస్ పరిమితమైంది. ఈ 39 మంది ఎమ్మెల్యేల్లోనూ ఒకరు మరణించగా.. కొందరు కాంగ్రెస్లోకి జంప్ అయ్యారు.
తెలంగాణ భవన్ వేదికగా బయటపడిన బీఆర్ఎస్ నేతల మధ్య విబేధాలు వెలుగు చూశాయి. సికింద్రబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి మధ్య గొడవ జరిగింది. మాగంటి గోపీనాథ్ మాట్లాడుతుండగా శ్రీధర్ రెడ్డి అడ్డుకున్నారు. శ్రీధర్ రెడ్డి పై మాగంటి ఆగ్రహం వ్యక్తం చేశారు
Telangana: తెలంగాణ భవన్లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ కవిత, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ మహిళ కార్పోరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ... తెలంగాణ ఆడ బిడ్డలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
మాజీ సీఎం, బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్ (KCR) పార్టీ కేంద్ర కార్యాలయం ‘తెలంగాణ భవన్’కు చేరుకున్నారు. కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ పరిధిలోని పార్టీ నేతలతో ఆయన భేటీ కాబోతున్నారు. ఈ నెల 10న కరీంనగర్లో నిర్వహించనున్న సభపై నేతలతో చర్చించనున్నారు. పార్లమెంట్ ఎన్నికలు, భవిష్యత్ కార్యాచరణతో పాటు ఈ నెల 10 కరీంనగర్లో నిర్వహించతలపెట్టిన సభపై చర్చించనున్నారని తెలుస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రభను కోల్పోతుంది. లోక్ సభ ఎన్నికల్లో అయినా సత్తా చాటుదాం అనుకుంటే.. ఉన్న ఎంపీలు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే ఇద్దరు ఎంపీలు పార్టీని వీడారు. మరో ముగ్గురు ఎంపీలు క్యూ లైన్లో ఉన్నారు.
CM Revanth Vs KCR: తెలంగాణలో అధికార కాంగ్రెస్.. ప్రతిపక్ష బీఆర్ఎస్ (Congress Vs BRS) నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయ్. నీటి పంపకాల దగ్గర మొదలైన వివాదం.. వ్యక్తిగత విమర్శల దాకా వెళ్లింది. ఆఖరికి బూతులు తిట్టుకోవడం.. ఒకరిపై ఒకరు చెప్పులు చూపించుకుంటున్న పరిస్థితి. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను (KCR) విమర్శిస్తూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఓ పదం వాడటంతో.. బీఆర్ఎస్ నేతలు మీడియా ముందుకొచ్చి చెలరేగిపోయారు..