BRS: ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం.. తెలంగాణ ఉద్యమం దేశానికే ఆదర్శమన్న కేటీఆర్
ABN , Publish Date - Apr 27 , 2024 | 11:04 AM
బీఆర్ఎస్ పార్టీ 24వ వార్షికోత్సవాన్ని పార్టీ శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో సాదాసీదాగా వేడుకలు నిర్వహించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) నేతలు, కార్యకర్తలకు ఇప్పటికే ఆదేశించారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ 24వ వార్షికోత్సవాన్ని పార్టీ శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో సాదాసీదాగా వేడుకలు నిర్వహించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) నేతలు, కార్యకర్తలకు ఇప్పటికే ఆదేశించారు.
శనివారం ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్ లో కేటీఆర్.. బీఆర్ఎస్ జెండా ఎగరవేసి.. నేతలు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. "ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగాలని ఉద్యమ నేత, రథసారథి కేసీఆర్ బీఆర్ఎస్‌ను స్థాపించారు. ఎన్నో ఏళ్ల పోరాటంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం లక్ష్యం నెరవేరింది. అధికార గర్వంతో ఉన్న ఆనాటి కాంగ్రెస్ సర్కార్ మెడలు వంచి రాష్ట్ర సాధన కోసం కృషి చేశాం. కుట్రలు ప్రలోభాలతో ఉద్యమాన్ని ఆపాలని కాంగ్రెస్ చూసింది. రాష్ట్రం సిద్ధించాక కేసిఆర్ నాయకత్వంలోనే అభివృద్ది సాధ్యమైంది. 10 ఏళ్లల్లో బీఆర్ఎస్ సర్కార్ ఎన్నో సమస్యల్ని పరిష్కరించింది. ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ నిలిచిపోయింది.
రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా పార్టీ విస్తరించింది. కానీ దురదృష్టవశాత్తూ 2023 ఎన్నికల్లో ఓటమి పాలయ్యం. ఇప్పటికీ కేసిఆర్ మీద నమ్మకం ఉంది. కేసీఆరే మళ్లీ సీఎం కావాలని కోరుకుంటోంది. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా మళ్లీ బంపర్ మెజారిటీతో అధికారంలోకి వస్తాం. ఉద్యమంలో కూడా మమ్మల్ని కించపరిచారు. మేమేనాడు కుంగిపోలేదు. ఇప్పుడూ అదే ధైర్యంతో ఉంటాం. బీఆర్ఎస్ జెండా మోసి కార్యకర్తలకు పాధాభివందనం. అమరవీరుల త్యాగం మరువలేనిది. వారి ఆకాంక్షల సాధనే ధ్యేయంగా బీఆర్ఎస్ ముందుకెళ్తుంది" అని కేటీరామారావు స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Telangana and Telugu News Here