Share News

Hyderabad: కొత్తచట్టాలతో ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం..

ABN , Publish Date - Jul 01 , 2024 | 03:25 AM

భారత న్యాయవ్యవస్థను కేంద్రం నిర్వీర్యం చేస్తోందని.. ఈనెల 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న కొత్తచట్టాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం కలిగించేలా ఉన్నాయని మాజీ ఎంపీ బి. వినోద్‌కుమార్‌ ఆరోపించారు.

Hyderabad: కొత్తచట్టాలతో ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం..

  • సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేస్తా: బి.వినోద్‌

హైదరాబాద్‌, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): భారత న్యాయవ్యవస్థను కేంద్రం నిర్వీర్యం చేస్తోందని.. ఈనెల 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న కొత్తచట్టాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం కలిగించేలా ఉన్నాయని మాజీ ఎంపీ బి. వినోద్‌కుమార్‌ ఆరోపించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌, ఇండియన్‌ పీనల్‌ కోడ్‌, ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌ చట్టాలను రద్దు చేసి వాటిస్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలను అమల్లోకి తెస్తోందన్నారు.


స్వాతంత్య్రం నాటి నుంచి ఉన్న ఈ చట్టాల్లో మార్పు తెచ్చిన నేపథ్యంలో వాటివల్ల మంచి జరగకపోగా.. ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆరోపించారు.కొత్త చట్టాల వల్ల భాదితుడికి అన్యాయం జరగనుందని, ఎఫ్‌.ఐ.ఆర్‌ నమోదు చేయకుండానే ప్రాథమిక (ప్రిలిమినరీ) విచారణ చేసే విధంగా కొత్త చట్టం తెచ్చారన్నారు కొత్త చట్టాలపై కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

Updated Date - Jul 01 , 2024 | 03:25 AM