Home » Telangana BJP
ఈటల.. ఈటల.. (Etela) తెలంగాణ రాజకీయాల్లో (TS Politics) ఇప్పుడీ పేరు మార్మోగుతోంది.. గత కొన్నిరోజులుగా తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా బీజేపీలో నెలకొన్న పరిస్థితులతో ఈటల రాజేందర్ (Etela Rajender) ఏం చేయబోతున్నారు..? కీలక నిర్ణయమే తీసుకుంటారా..? గత కొన్నిరోజులుగా ఆయన అసంతృప్తితో రగిలిపోతుండటానికి కారణాలేంటి..? బీజేపీలో కంటిన్యూ అవుతారా.. లేకుంటే కాంగ్రెస్ గూటికి చేరుతారా..? ..
తెలంగాణలో చేరికలతో రాజకీయ పార్టీలన్నీ బిజిబిజీగా ఉంటున్న వేళ సడన్‌గా ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) పేరు తెరపైకి వచ్చింది. రాష్ట్ర రాజకీయాల్లో (TS Politics) కవిత గురించే పెద్ద చర్చ జరుగుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. కవిత.. కవిత.. అంటూ ఆమె చుట్టూనే తెలంగాణ రాజకీయాలన్నీ తిరుగుతున్నాయ్..
తెలంగాణ రాజకీయాలు చేరికలతో హీటెక్కాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అధిష్టానాలు కీలక నేతలను చేర్చుకునే పనిలో బిజిబిజీగా ఉంటున్నాయి. బీఆర్ఎస్ బహిష్కృత నేతలైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావును కాంగ్రెస్ చేర్చుకుంటూ ఉండటంతో.. గులాబీ బాస్ కేసీఆర్ కూడా వ్యూహరచన చేసుకుంటూ వెళ్తున్నారు. ఎవరైతే కాంగ్రెస్ బడా నేతలు అసంతృప్తిగా ఉన్నారో.. వారందరికీ గాలం వేసే పనిలో ఉన్నారు..
అవును.. ఢిల్లీకి (Delhi) రావాలని తెలంగాణ బీజేపీ నేతలు (BJP Leaders) ఈటల రాజేందర్ (Etela Rajender) , కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి (Komati Reddy Rajagopal Reddy) పిలుపొచ్చింది..! రెండ్రోజులకోసారి పార్టీ మారుతున్నారని, బీజేపీలో అసంతృప్తిగానే కొనసాగుతున్నారని వార్తలు వస్తుండటంతో ఈ ఇద్దరి విషయంలో ఏదో ఒకటి తేల్చేయాలని అగ్రనేతలు ఫిక్స్ అయ్యారని విశ్వసనీయ వర్గాల సమాచారం..
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkatareddy) ఎవరూ లేక ఒంటరిగా ఫీలవుతున్నారా..? ఇప్పుడు ఆయనకు ఎవరూ అండగా లేరా..? పార్టీలో ఉన్న సొంత తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) కాషాయ కండువా (BJP) కప్పుకోగా.. శిష్యుడిగా ఉన్న చిరుమర్తి లింగయ్య (Chirumarthi Lingaiah) బీఆర్ఎస్ (BRS) తీర్థం పుచ్చుకోవడంతో ఇప్పుడు ఆయనకు నా అని చెప్పుకునే వాళ్లెవరూ లేకుండా పోయారా..? ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆ ఇద్దర్నీ ఘర్ వాపసీ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారా..?..
అవును.. ఈటల రాజేందర్ (Etela Rajender) ఎందుకో మౌనం పాటిస్తున్నారు..! ఇదివరకున్నట్లుగా చురుగ్గా ఉండట్లేదు..! అసలు ఈ మధ్య ఎక్కడా కనిపించట్లేదు..! ఇవీ ఆయన అభిమానులు, అనుచరులు, కార్యకర్తల్లో వినిపిస్తున్న మాటలు. గులాబీ (BRS) పార్టీకి గుడ్ బై చెప్పి కాషాయ కండువా (BJP) కప్పుకున్నాక హైపర్ యాక్టివ్‌గా ఉన్న ఈటల సడన్‌గా డీలా పడిపోయారు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) గెలుపుపై ఎవరి ధీమా వారిదే.. హ్యాట్రిక్ కొట్టబోతున్నామని బీఆర్ఎస్ (BRS) చెబుతుంటే.. మూడోసారి ఎలాగెలుస్తారో చూద్దామని కాంగ్రెస్ (Congress), బీజేపీలో (BJP) ఉన్నాయి.. కర్ణాటక (Karnataka) తర్వాత తాము గెలవబోయేది తెలంగాణలోనే అని కాంగ్రెస్ చెప్పుకుంటోంది..
అవును.. తెలంగాణ కాంగ్రెస్ (TS Congress) చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్’ (Operation Akarsh) చాపకింద నీరులా సాగుతోంది.. యువనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర (Rahul Jodo Yatra), కన్నడనాట కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేయడంతో తెలంగాణలో పార్టీకి మంచిరోజులు వచ్చినట్లయ్యింది. .
ఈటల రాజేందర్‌కు (Etela Rajender) కీలక పదవి వస్తోంది.. త్వరలోనే ఆయనకు ప్రమోషన్.. ఇక తెలంగాణలో (Telangana) ఆయనకు తిరుగుండదు.. సీఎం కేసీఆర్‌పై (CM KCR) ఊహించని అస్త్రాన్నే బీజేపీ (BJP) ప్రయోగించబోతోంది..
తెలంగాణ బీజేపీలో (TS BJP) ఇప్పుడు అంతా గజిబిజీగా ఉంది.. ఇందుకు ప్రస్తుతం పార్టీలో నెలకొన్న పరిణామాలను చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది..! రాష్ట్ర అధ్యక్షుడ్ని మార్చబోతున్నారని ఈటల రాజేందర్ (Etela Rajender) లేదా డీకే అరుణకు (DK Aruna) ఈ పదవి కట్టబెడతారని వార్తలు రావడం.. మరోవైపు బండి సంజయ్‌ను (Bandi Sanjay) కేంద్ర మంత్రి పదవి (Central Minister) ఇచ్చి ఢిల్లీ పంపుతారని రోజుకో వార్త వస్తోంది..