TS Politics : చాలా రోజుల తర్వాత మీడియా ముందుకొచ్చిన ఈటల.. కీలక పదవిపై..!

ABN , First Publish Date - 2023-06-15T22:48:00+05:30 IST

ఈటల రాజేందర్‌కు (Etela Rajender) కీలక పదవి వస్తోంది.. త్వరలోనే ఆయనకు ప్రమోషన్.. ఇక తెలంగాణలో (Telangana) ఆయనకు తిరుగుండదు.. సీఎం కేసీఆర్‌పై (CM KCR) ఊహించని అస్త్రాన్నే బీజేపీ (BJP) ప్రయోగించబోతోంది..

TS Politics : చాలా రోజుల తర్వాత మీడియా ముందుకొచ్చిన ఈటల.. కీలక పదవిపై..!

ఈటల రాజేందర్‌కు (Etela Rajender) కీలక పదవి వస్తోంది.. త్వరలోనే ఆయనకు ప్రమోషన్.. ఇక తెలంగాణలో (Telangana) ఆయనకు తిరుగుండదు.. సీఎం కేసీఆర్‌పై (CM KCR) ఊహించని అస్త్రాన్నే బీజేపీ (BJP) ప్రయోగించబోతోంది.. ఇవీ గత వారం, పదిరోజులుగా గల్లీ నుంచి ఢిల్లీ వరకూ వినిపిస్తున్న మాటలు. అంతేకాదు.. అంతా అయిపోయిందని అధికారిక ప్రకటన ఒక్కటే మిగులుందని కూడా పెద్దఎత్తున వార్తలొచ్చాయ్..! ఈ వార్తలపై కేంద్రం నుంచి ఎలా రియాక్షన్ రాకపోవడం, పైగా ఖమ్మం సభలో (Khammam Sabha) కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) తెలంగాణలో నెలకొన్ని తాజా పరిణామాలపై ఫుల్ క్లారిటీ వస్తుందని అందరూ భావించారు.. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల సభ రద్దయ్యింది. దీంతో నాటి నుంచి నేటి వరకూ ఈటలపై వచ్చిన రూమర్స్‌కు ఇంకా ఫుల్ స్టాప్ పడలేదు.. పైగా అగ్రనేతలు కూడా దీనిపై మౌనం పాటిస్తుండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.

Amit-Shah.jpg

అసలేం జరిగిందంటే..

ఈటల పదవి, ప్రమోషన్‌పై మీడియా, సోషల్ మీడియా (Social Media) కోడై కూసింది కానీ ఇంతవరకూ క్లారిటీ రాలేదు. అయితే.. సరిగ్గా ఇదే సమయంలో ఈటల రాజేందర్ మీడియా ముందుకొచ్చారు. హమ్మయ్యా.. రావాల్సిన వ్యక్తే గురువారం నాడు మీడియా ముందుకొచ్చారు ఇన్నిరోజులుగా నెలకొన్న ఈ పరిస్థితులకు ఫుల్ స్టాప్ పడుతుందని రాష్ట్ర నేతలు, అభిమానులు, కార్యకర్తలు భావించారు. అయితే.. కేసీఆర్ సర్కార్ (KCR Sarkar) విమర్శలు గుప్పించడం, ఇంకా కొన్ని విషయాలపై మాట్లాడారే కానీ తెలంగాణ బీజేపీలో నెలకొన్న పరిస్థితులపై కానీ.. ప్రమోషన్ గురించి కానీ కనీసం స్పందించడానికి కూడా సాహసించలేదు. కనీసం అంతా అధిష్టానం చేతిలో ఉందని కానీ.. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని కూడా రాజేందర్ చెప్పలేదు. దీంతో ఇటు రాష్ట్రంలో.. అటు కేంద్రంలో ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి.

Etela-Rajender.jpg

ఇంతకీ ఏం మాట్లాడారో..?

రాష్ట్రంలో రైతులకు సంకెళ్లు వేయడాన్ని ఈటల రాజేందర్ తీవ్రంగా ఖండించారు. ‘కిసాన్‌ సర్కార్‌ (Kisan Sarkar) అంటూ..రైతులకు (Formers) సంకేళ్లు వేస్తారా?. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా..? రైతులకు సంకెళ్లు వేసిన ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదు. పేదల భూములు గుంజుకొని పెద్ద మనుషులకు ఇస్తున్నారు. కోట్లు విలువైన భూములు గుంజుకుని లక్షలు ఇచ్చే అధికారం ఎవరిచ్చారు..?. బెదిరింపులకు, కేసులకు భయపడితే న్యాయాన్ని రక్షించుకోలేం. రైతులకు బీజేపీ అన్ని విధాలుగా అండగా ఉంటుంది’ అని ఈటల తెలిపారు.

Etela.jpg

మొత్తానికి చూస్తే.. అమిత్ షా సభతో రాష్ట్ర బీజేపీలో నెలకొన్న గందరగోళానికి ఫుల్‌స్టాప్ పడుతుందని భావించినా అదేమీ జరగలేదు. పైగా గురువారం నాడు తరుణ్‌చుగ్ (Tarun Chugh) స్పందించి అధ్యక్ష పదవి మార్పు ఉండదని చెప్పారే కానీ ఈటల పదవి గురించి ప్రస్తావనే తీసుకురాలేదు. దీంతో ఇప్పట్లో ఈటల పదవిపై క్లారిటీ వచ్చే ఛాన్సే కనిపించట్లేదు. రాజేందర్‌కు పదవి ఇస్తారన్న వార్తల్లో నిజానిజాలెంతో తెలియాలంటే.. ఇస్తున్నామని కానీ లేకుంటే అస్సలు అలాంటిదేమీ లేదనిగానీ హైకమాండ్ నుంచి అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Janasena : పదే పదే పవన్ నోట అదే మాట.. ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ.. సమాచారం ఎవరిచ్చారో..?

******************************

Telugu States Politics : బీఆర్ఎస్‌లో అంతా గందరగోళం.. తండ్రిదో దారి.. కొడుకుదో దారి.. మంత్రులది మరోదారి.. ఎందుకీ పరిస్థితి..?

******************************

Updated Date - 2023-06-15T22:52:03+05:30 IST