Amit Shah Telangana Tour : తెలంగాణ బీజేపీలో అంతా గందరగోళం.. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి.. షా రాకతో ఫుల్ క్లారిటీ వస్తుందా..?

ABN , First Publish Date - 2023-06-13T23:17:09+05:30 IST

తెలంగాణ బీజేపీలో (TS BJP) ఇప్పుడు అంతా గజిబిజీగా ఉంది.. ఇందుకు ప్రస్తుతం పార్టీలో నెలకొన్న పరిణామాలను చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది..! రాష్ట్ర అధ్యక్షుడ్ని మార్చబోతున్నారని ఈటల రాజేందర్ (Etela Rajender) లేదా డీకే అరుణకు (DK Aruna) ఈ పదవి కట్టబెడతారని వార్తలు రావడం.. మరోవైపు బండి సంజయ్‌ను (Bandi Sanjay) కేంద్ర మంత్రి పదవి (Central Minister) ఇచ్చి ఢిల్లీ పంపుతారని రోజుకో వార్త వస్తోంది..

Amit Shah Telangana Tour : తెలంగాణ బీజేపీలో అంతా గందరగోళం.. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి.. షా రాకతో ఫుల్ క్లారిటీ వస్తుందా..?

తెలంగాణ బీజేపీలో (TS BJP) ఇప్పుడు అంతా గజిబిజీగా ఉంది.. ఇందుకు ప్రస్తుతం పార్టీలో నెలకొన్న పరిణామాలను చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది..! రాష్ట్ర అధ్యక్షుడ్ని మార్చబోతున్నారని ఈటల రాజేందర్ (Etela Rajender) లేదా డీకే అరుణకు (DK Aruna) ఈ పదవి కట్టబెడతారని వార్తలు రావడం.. మరోవైపు బండి సంజయ్‌ను (Bandi Sanjay) కేంద్ర మంత్రి పదవి (Central Minister) ఇచ్చి ఢిల్లీ పంపుతారని రోజుకో వార్త వస్తోంది. దీంతో అసలు పార్టీలో ఏం జరుగుతోంది..? ఇందులో నిజమెంత..? అని తెలియక రాష్ట్ర కమలనాథులు, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు ఆలోచనలో పడ్డారు. ఇవన్నీ ఒక ఎత్తయితే పార్టీలో కొందరు బండి వర్గం.. ఇంకొందరు ఈటల వర్గంగా విడిపోయి.. రహస్య సమావేశాలు, మీడియా మీట్‌లు పెట్టేస్తున్నారు.. దీంతో ఈ వ్యవహారం గల్లీ నుంచి ఢిల్లీ (Delhi) వరకూ ఓ రేంజ్‌లో చర్చ నడుస్తోంది. అయితే పార్టీలో నెలకొన్న గందరగోళానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనతో ఫుల్ క్లారిటీ వస్తుందని నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు.

bjp.jpg

సరిగ్గా ఇదే టైమ్‌లోనే ఎందుకో..?

తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే సువర్ణావకాశంగా మలుచుకుంటోంది. ఈ క్రమంలోనే అగ్రనేతలను రాష్ట్రానికి తీసుకురావడం భారీ సభలు, ర్యాలీలు ప్లాన్‌ చేస్తున్నారు కమలనాథులు. అయితే కర్ణాటక ఎన్నికల తర్వాత ఎందుకో రాష్ట్ర బీజేపీలో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. అక్కడ ఓడిపోవడంతో అప్పటి వరకూ ఉన్న అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల నుంచి నేతలను కాషాయ పార్టీలో చేర్చుకోవడానికి కమలనాథులు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. సరిగ్గా ఇదే సమయంలో అటు కన్నడనాట ఫలితాలు రావడం.. ఇటు అప్పటి వరకూ బీజేపీలోకి రావాలనుకున్న నేతలంతా మనసు మార్చుకోవడంతో పరిస్థితులన్నీ మారిపోయాయి. దీంతో రాష్ట్ర నాయకత్వంపై అగ్రనేతలు గుర్రుగా ఉన్నారట. సరిగ్గా ఇదే సమయంలో అధ్యక్షుడి మార్పు అని వార్తలు రావడం దీంతో.. నేతల మధ్య విబేధాలు, పరస్పర ఆరోపణలతో బీజేపీ గ్రాఫ్‌పై సొంత పార్టీ నేతలకే అనుమానం వచ్చినంత పరిస్థితి ఏర్పడింది. ఈ వరుస పరిణామాలన్నీ పార్టీని తెగ ఇబ్బంది పెడుతున్నాయని నేతలు చెప్పుకుంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే కోవర్టులు ఉన్నారని నేతలు మీడియా ముందుకొచ్చి చెప్పడంతో పార్టీలో గందరగోళం మరింత ఎక్కువైనట్లు అయ్యింది.

Bandi-Dk-and-Etela.jpg

పక్కా ప్లాన్‌తోనే..!

తెలంగాణ బీజేపీలో ప్రస్తుతం నెలకొన్న ఇబ్బందులు, ఈ గందరగోళ పరిస్థితులను చక్కదిద్దేందుకు హైకమాండ్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే నేతల మధ్య విబేధాలను క్లియర్ చేయడం, అసంతృప్తులను శాంతింప చేయడానికి భారీ బహిరంగ సభలు, ర్యాలీలకు బీజేపీ అగ్రనేతలు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే అమిత్ షా ఖమ్మం పర్యటనకు విచ్చేస్తున్నారు. ఆయన తర్వాత వరుసగా కేంద్ర మంత్రులు, జాతీయస్థాయి నేతలు తెలంగాణలో పర్యటిస్తారని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. గురువారం నాడు ఖమ్మంలో జరిగే సభ గ్రాండ్ సక్సెస్ అయితే మాత్రం నేతల మధ్య విబేధాలు తొలగిపోతాయని కమలనాథులు భావిస్తున్నారు. ఎందుకంటే ఖమ్మంలో బీజేపీ అంత బలం లేదు కాబట్టి అటువంచి చోట సత్తా చాటితే ఆ కిక్కే వేరుగా ఉంటుందని రాష్ట్రనేతలు భావిస్తున్నారట. అందుకే భారీగా జనసమీకరణకు ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఈ సభకు హాజరయ్యే జనాలు, నేతలను బట్టి.. కమలనాథుల్లో విబేధాలపై ఒక అంచనాకు రావొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

amith-shah.jpg

‘షా’రొస్తున్నారు.. క్లారిటీ వచ్చేనా..?

రాష్ట్ర అధ్యక్ష పదవి మార్పు, ఈటలకు కీలక పదవి, బండికి కేంద్ర మంత్రి పదవి.. పార్టీలో విబేధాలు, నేతల రహస్య సమావేశాలు, అసంతృప్తితో రగిలిపోతున్న నేతలు ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ బీజేపీలో బోలెడన్ని సమస్యలున్నాయ్. ఇప్పటి వరకూ ఈ విషయాలపై అగ్రనేతలు ఒక్కరూ స్పందించి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో రోజురోజుకూ కార్యకర్తలు, నేతల్లో గందరగోళమే తప్ప సమాధానాలు దొరకట్లేదు. అయితే.. అమిత్ షా రాకతో ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరుకుతుందని కార్యకర్తలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఒకప్పుడు క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే బీజేపీలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను చక్కబెట్టి.. అందర్నీ ఒక థాటిపైకి అమిత్ షా తెస్తారో లేకుంటే ఆ ఊసే లేకుండా బీఆర్ఎస్, కాంగ్రెస్‌పైనే యథావిధిగా విమర్శలు గుప్పించి సభ ముగించుకొని ఢిల్లీ పయనమవుతారో వేచి చూడాలి మరి. షా క్లారిటీ ఇవ్వకపోతే మాత్రం పరిస్థితులు ఊహకందని రీతిలో మారిపోయినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏం జరుగుతుందో ఏమో చూడాలి మరి.

Amith-Shah-Class.jpg

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Amith Shah ABN MD Radhakrishna: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ‌ని కలవనున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా..

******************************

Shah Meeting With Celebrities : టాలీవుడ్‌పై బీజేపీకి ఎందుకింత స్పెషల్ ఫోకస్.. రాజమౌళి, ప్రభాస్‌తో అమిత్ షా భేటీపై సర్వత్రా ఉత్కంఠ..!

******************************

Ambati Rayudu In Politics : అంబటి రాయుడు కాదు బాబోయ్.. బూతుల రాయుడు.. ఇంత పచ్చిగానా.. ఓహో వైసీపీకి నచ్చింది ఇందుకేనా..?

******************************

Janasena : జనసేన కండువా కప్పుకున్న ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్.. చేరిక సరే ఈసారైనా పోటీచేస్తారా..?

******************************

TS Congress : కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు జరుగుతున్న వేళ సీన్ రివర్స్.. ఎందుకిలా..?

******************************

Mudragada : రీ-ఎంట్రీకి సిద్ధమైన ముద్రగడ.. ఎంపీగా బరిలోకి దింపే యోచనలో వైసీపీ.. ఇంత నమ్మకద్రోహం చేసినా ఎందుకీ సాహసం..!?

******************************
TS Politics : రేవంత్ రెడ్డి సక్సెస్.. బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కేసీఆర్‌ అత్యంత సన్నిహితుడు రాజీనామా..

*****************************

Updated Date - 2023-06-15T18:23:57+05:30 IST